తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తెరుచుకున్న శబరిమల ఆలయం- భక్తులకు అవి తప్పనిసరి - శబరిమల ఆలయ ప్రవేశం

శబరిమల ఆలయం సోమవారం తెరుచుకుంది. మంగళవారం ఉదయం నుంచి భక్తులను అనుమతించనున్నారు. కొవిడ్ టీకా రెండు డోసులు వేసుకున్నవారు, ఆర్​టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు కలిగిన వారికి మాత్రమే ఆలయ ప్రవేశం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

sabarimala
శబరిమల

By

Published : Nov 15, 2021, 7:53 PM IST

Updated : Nov 15, 2021, 8:10 PM IST

తెరుచుకున్న శబరిమల ఆలయం

కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం సోమవారం తెరుచుకుంది. సీజనల్​ యాత్ర సందర్భంగా ఆలయ దర్శనం ప్రారంభమైంది. సోమవారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించి.. మంగళవారం నుంచి భక్తులను అనుమతించనున్నట్లు దేవస్థానం బోర్డు తెలిపింది.

కొవిడ్-19 కారణంగా గతంలో అనేకసార్లు మూతబడిన దేవాలయం.. దాదాపు రెండేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో తెరుచుకుంది. మంగళవారం నుంచి రోజూ 30వేల మంది భక్తులను ఆలయంలోకి అనుమతించనున్నారు. వర్చువల్ క్యూ బుకింగ్ విధానం ద్వారా భక్తులకు ఎంట్రీ ఉంటుందని దేవస్థానం బోర్డు తెలిపింది. వర్షాలు, వాతావరణ ప్రతికూలతల దృష్ట్యా మొదటి మూడు రోజులు.. తక్కువమంది భక్తులకే ఆలయ ప్రవేశం ఉంటుందని పేర్కొంది. భక్తుల భద్రత దృష్ట్యా.. పంపానదిలో స్నానాలను నిషేధించినట్లు తెలిపింది.

అవి తప్పనిసరి

కొవిడ్​-19 దృష్ట్యా.. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారికి, ఆర్​టీపీసీఆర్ నెగెటివ్ ధ్రువపత్రం సమర్పించినవారికే ఆలయ ప్రవేశం ఉంటుందని దేవస్థానం బోర్డు తెలిపింది. క్యూలైన్​లో భౌతికదూరం పాటించడం, మాస్కు ధరించడం విధిగా పాటించాలని ఆదేశించింది. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున.. శబరిమల కొండపై రాత్రిళ్లు ప్రయాణించొద్దని ఆదేశించింది.

కొండపైకి ప్రత్యేక బస్సులు..

భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది కేరళ ప్రభుత్వం. వాహనాలను నీలక్కల్ వరకు మాత్రమే అనుమతించి.. అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో భక్తులను కొండపైకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.

కట్టుదిట్టంగా ఏర్పాట్లు..

దర్శనానికి వచ్చే భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు రాష్ట్ర వైద్యశాఖ మంత్రి తెలిపారు. ప్రసాద కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించేందుకూ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'నా గేదెకు చేతబడి చేశారు.. పాలు ఇవ్వడం లేదు'

Last Updated : Nov 15, 2021, 8:10 PM IST

ABOUT THE AUTHOR

...view details