కేరళలోని శబరిమలలో సంక్రాంతి సందర్భంగా పొన్నాంబల మేడు కొండల్లో మకరజ్యోతి దర్శనమిచ్చింది. కొవిడ్ నిబంధనల మధ్య పరిమిత సంఖ్యలో వచ్చిన భక్తులు మకరజ్యోతి దర్శనంతో తన్మయత్వం పొందారు. పంబ, పులిమేడ్, నీలికల్ ప్రాంతాల్లో జ్యోతి వీక్షణకు ట్రావెన్కోర్ దేవస్థానం ఏర్పాట్లు చేసింది.
5000 మందే..
కరోనాను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది మకరజ్యోతి దర్శనానికి ఐదు వేల మందిని మాత్రమే అనుమతించారు. ఇందుకోసం ఆన్లైన్లో పేరు నమోదు చేసుకునేలా ఏర్పాట్లు జరిపారు. పంచలిమేడు, పరున్తుపుర, పుల్మేడు ప్రాంతాల్లో భక్తులు బస చేయడాన్ని నిషేధించారు.
ఇదీ చదవండి :జల్లికట్టుకు రాహుల్ హాజరు వెనుక ఇదీ కారణం!