Russia Ukraine War: యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి తిరిగివచ్చిన భారత వైద్య విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రష్యా పట్ల భారత వైఖరితో అసహనంగా ఉన్న ఉక్రెయిన్ ప్రొఫెసర్లు.. భారత వ్యతిరేక ఆలోచనా ధోరణి ప్రదర్శిస్తున్నారని ఉత్తరాఖండ్‌కు చెందిన వైద్య విద్యార్థులు ఆరోపించారు. భారతీయ విద్యార్థులకు ఆన్లైన్లో తరగతులు చెప్పడానికి నిరాకరిస్తున్నారని వెల్లడించారు. ఒకవేళ తరగతులు నిర్వహించినా.. నిత్యం పేలుళ్ల శబ్దాలతో అంతరాయం కలుగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో చేరడానికి తమకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇండియన్స్‌కు ఆన్లైన్ క్లాసులు చెప్పేందుకు నో! ఉక్రెయిన్ ప్రొఫెసర్ల 'రాజకీయం'!! - రష్యా యుద్ధం
Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వైద్య విద్యను మధ్యలోనే వదిలేసి స్వదేశానికి తిరిగివచ్చిన భారత విద్యార్థులకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. భారత వైఖరి పట్ల అసహనంతో ఉన్న ఉక్రెయిన్ ప్రొఫెసర్లు తమకు ఆన్లైన్లో తరగతులు చెప్పడానికి నిరాకరిస్తున్నారని ఉత్తరాఖండ్ వైద్య విద్యార్థులు ఆరోపించారు.
యుద్ధం వల్ల ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి వచ్చిన భారత విద్యార్థులు
యుద్ధం కారణంగా వైద్య విద్య మధ్యలో ఉన్నవారు పోలాండ్, హంగేరీ లాంటి దేశాల్లో పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. కానీ అక్కడ ఖర్చులు విపరీతంగా ఉన్నాయని, ఉక్రెయిన్‌తో పోలిస్తే.. నాలుగు రెట్లు అధికమని విద్యార్థులు వాపోయారు. ఉక్రెయిన్‌లో వైద్య విద్య పూర్తి చేయడానికి రూ.3 లక్షలు మాత్రమే ఖర్చు అవుతుందని తెలిపారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుని తమ సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు.