Indian students Ukraine: ఉన్నత చదువుల కోసం గుజరాత్ నుంచి ఉక్రెయిన్‌కు వెళ్లిన దాదాపు ఐదు వేల మంది విద్యార్థులు ఆ దేశంలో చిక్కుకున్నారు. రష్యా యుద్ధానికి సిద్ధపడిందన్న వార్తల మధ్య వీరి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వీరిని వెంటనే భారత్‌కు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌ను ఆశ్రయించారు.
Indian students stranded Ukraine:
చిక్కుకున్న విద్యార్థుల గురించి సమాచారాన్ని ఉక్రెయిన్‌లోని బ్రిటన్ రాయబార కార్యాలయం సేకరించిందని తల్లిదండ్రుల్లో ఒకరైన అజయ్ పాండ్య ఈటీవీ భారత్‌కు వెల్లడించారు. మొత్తం 18 వేల మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకున్నారని తెలిపారు. వారంతా మానసికంగా కుంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.