తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత్ నుంచి సంపూర్ణ మద్దతు కోరుతున్నాం' - ఉక్రెయిన్​ యుద్ధం

Russia Ukraine crisis: ఉక్రెయిన్​పై రష్యా యుద్ధం ప్రకటించింది. అన్ని వైపుల నుంచి దాడి చేస్తోంది. ఈ క్రమంలో భారత్​ మద్దతు కోరింది ఉక్రెయిన్​. ఆ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు భారత్​ మద్దతు ఇవ్వాలని కోరారు భారత్​లో ఆదేశ రాయబారి ఇగోర్​ పొలిఖా. సంక్షోభ పరిష్కారానికి భారత ప్రధాని ముందుకు రావాలన్నారు.

Ambassador of Ukraine to India
ఇగోర్​ పొలిఖా

By

Published : Feb 24, 2022, 3:18 PM IST

Updated : Feb 24, 2022, 4:13 PM IST

Russia Ukraine crisis: సంక్షోభం సమయంలో భారత్​ నుంచి సంపూర్ణ మద్దతు కోరుతున్నామని ఉక్రెయిన్​ పేర్కొంది. ఉక్రెయిన్‌ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు భారత్‌ మద్దతు ఇవ్వాలన కోరుతున్నట్లు చెప్పారు ఆ దేశ రాయబారి ఇగోర్‌ పొలిఖా. తక్షణమే యుద్ధం నిలువరించే దిశగా భారత్‌ చర్యలు తీసుకోవాలి కోరారు. సంక్షోభ పరిష్కారానికి భారత ప్రధాని ముందుకు రావాలన్నారు.

" రష్యా ఏకపక్ష దాడిని ప్రపంచ దేశాలు ఖండించాలి. భారత ప్రధాని తన పలుకుబడితో రష్యా దాడిని నిలువరించాలి. సంక్షోభ వేళ భారత్‌ అండగా నిలవాలి. జరుగుతున్న పరిణామాలను భారత్‌ నిశితంగా గమనిస్తోంది. జపాన్‌ సహా పలు దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతు ప్రకటించాయి. పరిస్థితులు క్షీణిస్తున్నందున ఉక్రెయిన్‌కు భారత్‌ మద్దతు ఇవ్వాలి. రష్యాతో భారత్‌కు సత్సంబంధాలు ఉండవచ్చు.. కానీ, సంక్షోభ సమయంలో ఉక్రెయిన్‌కు భారత్‌ అండగా నిలవాలి. శక్తిమంత నేతల్లో ఒకరైన మోదీ.. సమస్య పరిష్కారానికి కృషి చేయాలి."

- ఇగోర్​ పొలిఖా, భారత్​లో ఉక్రెయిన్​ రాయబారి.

మోదీ పలుకుబడితో పరిస్థితులను చక్కదిద్దేందుకు యత్నించాలని కోరారు ఇగోర్​ పొలిఖా. ఉక్రెయిన్‌ ప్రజలకు భరోసా ఇచ్చేలా మోదీ చొరవ చూపాలన్నారు. అన్ని విషయాలను భారత ప్రభుత్వ పెద్దలతో చర్చించినట్లు చెప్పారు. సంక్షోభ వేళ భారత వ్యవహారశైలి అసంతృప్తి కలిగిస్తోందన్నారు.

ఇదీ చూడండి:రష్యా దాడుల్లో ఏడుగురు మృతి... రెండు పట్టణాలు వేర్పాటువాదుల వశం!

Last Updated : Feb 24, 2022, 4:13 PM IST

ABOUT THE AUTHOR

...view details