ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించిన అన్నాడీఎంకే, సంవత్సరానికి ఆరు వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చింది. తమిళనాడు ప్రజలందరికీ అమ్మ వాషింగ్ మిషన్ పథకం ప్రకటించింది. కుటుంబంలో వృద్ధ మహిళకు నెలకు 15 వందల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది.
'ప్రతి కుటుంబానికి ఏటా 6 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ' - అన్నాడీఎంకే హామీలు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం భారీ తాయిలాలతో అధికార అన్నాడీఎంకే మేనిఫెస్టో విడుదల చేసింది. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సహా ఆ పార్టీ సీనియర్ నేతలు మేనిఫెస్టోను విడుదల చేశారు.
'ప్రతి కుటుంబానికి ఏటా 6 సిలిండర్లు ఉచితం'
ఉచిత కేబుల్ కనెక్షన్ కూడా ప్రకటించిన అన్నాడీఎంకే.. శ్రీలంక తమిళులకు ద్వంద్వ పౌరసత్వం కల్పించేందుకు కృషిచేస్తామని పేర్కొంది. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపునకు చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. అమ్మ గృహ నిర్మాణ పథకం కింద అందరికీ ఇళ్లు ఇస్తామని, ఆటో డ్రైవర్లకు 25 వేల రూపాయల రాయితీతో ఎంజీఆర్ హరిత ఆటోలు అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో వివరించింది.
ఇదీ చదవండి:జేడీయూలో ఆర్ఎల్ఎస్పీ విలీనం
Last Updated : Mar 14, 2021, 8:53 PM IST