తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూల్స్ మార్చిన ప్రభుత్వం - ఇక ఇంటికే లిక్కర్​!

మద్యం షాపుల ముందు బారులు తీరే మందుబాబుల కష్టాలు ఇక తీరనున్నాయి! లిక్కర్​ను నేరుగా ఇంటివద్దకే సరఫరా చేసేలా ఎక్సైజ్ నిబంధనలను ప్రభుత్వం సవరించింది. దీంతో దేశ రాజధానిలో శుక్రవారం నుంచి మొబైల్ యాప్, వెబ్​సైట్ల ద్వారా లిక్కర్​ను బుక్​ చేసుకోవచ్చని సర్కార్​ ప్రకటన విడుదల చేసింది.

home delivery of liquor
రూల్స్ మార్చిన ప్రభుత్వం - ఇక ఇంటి వద్దకే లిక్కర్​!

By

Published : Jun 11, 2021, 2:03 PM IST

Updated : Jun 11, 2021, 5:35 PM IST

దేశ రాజధాని దిల్లీలో లిక్కర్ హోం డెలివరీకి మార్గం సుగమమైంది. మద్యం ప్రియులు ఇక నుంచి మొబైల్ యాప్, వెబ్​సైట్ల ద్వారా లిక్కర్​ను బుక్ చేసుకునే విధంగా.. సవరించిన ఎక్సైజ్​ నిబంధనలను దిల్లీ సర్కార్​ నోటిఫై చేసింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ గురవారం విడుదల కాగా.. ఆదేశాలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

ఇప్పటివరకు ఎందుకు లేదు?

గత ఎక్సైజ్​ నిబంధనల ప్రకారం ఫ్యాక్స్ లేదా ఈమెయిల్ ద్వారా చేసిన లిక్కర్​ ఆర్డర్లుకు మాత్రమే హోం డెలివరీ చేసే వెసులుబాటు ఉండేది. ఈ నిబంధనలు అసాధారణంగా ఉన్నందున ఎల్​-13 లైసెన్స్ తీసుకునెేందుకు ఇప్పటివరకు ఎవ్వరూ ముందుకు రాలేదు. అందుకే ఒక్క లైసెన్స్ కూడా జారీ కాలేదు.

సవరించిన నిబంధనల్లో ఏముంది?

సవరించిన నిబంధనల ప్రకారం మొబైల్​ యాప్, వెబ్​సైట్ల ద్వారా లిక్కర్ ఆర్డుర్లు తీసుకొని హొం డెలివరీ చేయొచ్చు. ఇందుకోసం దిల్లీ ఎక్సైజ్​ నిబంధనల్లోని రూల్​ 66ను ప్రభుత్వం మార్చింది. ఇందుకు సంబంధించిన గెజిట్​ నోటిఫికేషన్​ను సోమవారమే విడుదల చేసింది.

ఎక్కడికైనా సరఫరా చేయొచ్చా?

నూతన నిబంధనల ప్రకారం లైసెన్స్ పొందిన వారు బహిరంగ ప్రదేశాలు, టెర్రస్​, క్లబ్బుల్లోని కోర్టు యార్డులు, హోటల్ అనుబంధ బార్లు, రెస్టారెంట్లకు లిక్కర్ సరఫరా చేయొచ్చు. బాటిళ్లలోనూ ఆల్కహాల్​ పొందే సదుపాయం కస్టమర్లకు ఉంటుంది.

అమల్లోకి వచ్చిందా?

నిబంధనలు శుక్రవారం నుంచి మారినప్పటికీ అమలు కావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. వీటికి సంబంధించిన షరతులను ప్రభుత్వం తెలపకపోవడమే ఇందుకు కారణం.

Last Updated : Jun 11, 2021, 5:35 PM IST

ABOUT THE AUTHOR

...view details