తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రజల డిమాండ్​కు తలవంచితే అవమానానికి గురైనట్లు కాదు' - సత్యపాల్ మాలిక్​

ప్రజల డిమాండ్​కు తలవంచినంత మాత్రాన అవమానానికి గురైనట్లు కాదని అన్నారు మేఘాలయ గవర్నర్ సత్యపాల్​ మాలిక్(satyapal malik news)​. సాగు చట్టాలు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడాన్ని(farm laws repeal) స్వాగతించారు. ఈటీవీ భారత్​కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన పలు కీలక విషయాలపై మాట్లాడారు.

Meghalaya Governor Satya Pal Malik
'ప్రజల డిమాండ్​కు తలవంచితే అవమానానికి గురైనట్లు కాదు'

By

Published : Nov 20, 2021, 9:25 PM IST

మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్​కు.. ముక్కుసూటి మనిషని పేరుంది(satyapal malik news). ఆయన అనుకున్న అభిప్రాయన్ని నిర్మొహమాటంగా చెప్పేస్తారు. సాగు చట్టాల విషయంలోనూ అలాగే వ్యవహరించారు. వీటిని ఉపసంహరించుకోవాలని నిరసన చేస్తున్న రైతులకు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. అవసరమైతే గవర్నర్ పదవిననైనా వదులుకుంటానని, సాగు చట్టాల విషయంలో వెనక్కి తగ్గనని అనేకమార్లు తేల్చిచెప్పారు. తాజాగా.. ఇప్పుడు ప్రధాని మోదీ సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించడాన్ని(farm laws repeal) ఆయన స్వాగతించారు. ఈటీవీ భారత్​తో ప్రత్యేక ముఖాముఖిలో పాల్గొని పలు కీలక ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

సాగు చట్టాల ఉపసంహరణపై మీ స్పందనేంటి?

ప్రధాని నరేంద్ర మోదీ సరైన నిర్ణయమే తీసుకున్నారు(farm laws repeal reaction). అందుకు అభినందనలు చెబుతున్నా. ఇన్ని రోజులుగా నిర్విరామంగా ఆందోళనలు చేస్తున్న రైతులకు కూడా శుభాకాంక్షలు.

వ్యవసాయ చట్టాలు రైతులకు ఏ విధంగా హాని చేస్తాయని మీరు అనుకుంటున్నారు?

సమస్యంతా చట్టాలను అర్థం చేసుకోవడంలోనే ఉంది(farm laws news). ఒప్పంద వ్యవసాయం ఇందులో అతిపెద్ద సమస్య. అలాంటి ఇంకొన్ని అంశాలే రైతుల మదిని ప్రభావితం చేశాయి. తమ భూములను లాక్కొని కార్పొరెట్ శక్తుల చేతుల్లో పెడతారేమోనని రైతులు భావించారు. దానివల్లే అపనమ్మకం ఏర్పడింది. ఫలితంగా రైతుల్లో భయం నెలకొంది.

సాగు చట్టాల లానే ఆర్టికల్ 370, సీఏఏ ఉపసంహరించుకోవాలని డిమాండ్ వస్తే?

ఏ చట్టాన్నైనా ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే హక్కు ప్రజలకు ఉంది(meghalaya governor news). అది అమోదయోగ్యంగా ఉంటే ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. చట్టాన్ని వెనక్కి తీసుకోవద్దనే నిబంధనేమీ లేదు. బ్రిటిషర్లు కూడా చట్టాలను ఉపసంహరించుకున్నారు. నా దృష్టిలో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం సరైనదే. సీఏఏ గురించి నాకు ఎక్కువగా తెలియదు. దాని గురించి నేను మాట్లాడలేను.

సాగు చట్టాలు వెనక్కి తీసుకోవద్దని ఎవరు అనుకున్నారు?

నేను ఆ విషయంపై స్పందించను. అందులో చాలా మందికి సంబంధముంది. రాజకీయ పార్టీలకు చెందిన అనేక మంది నాయకులు సహా ప్రభుత్వ సంస్థలకు చెందిన వ్యక్తులున్నారు.

ఎవరికీ తలవంచరనే.. మోదీని ప్రజలు ఇష్టపడుతారనే ఒక అభిప్రాయం ఉంది?

ప్రపంచంలో ఎంత శక్తిమంతులైనా మృదువుగా ఉండాలి. నిర్ణయాలు వెనక్కి తీసుకోరు అనే విషయం గర్వానికి సంబంధించింది కాదు. మీ ప్రజలకు తలవంచితే ఏమవుతుంది? వారు విదేశీయులు కాదు కదా! ప్రజల డిమాండ్​కు తలవంచినంత మాత్రాన అవమానానికి గురైనట్లు కాదు. అలా అనడం సరికాదు. ఇలాంటి వారే.. రైతుల సమస్య పరిష్కారం కావద్దని కోరుకుంటున్నారు.

మోదీ, షాలతో మీ అభిప్రాయం నేరుగా చెప్పారా?

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో చాలా సార్లు నా అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాను. వాళ్ల అభిప్రాయాలు వాళ్లకు ఉంటాయి.

ఇదీ చదవండి:'చైనా ఆక్రమణకు పాల్పడిందనే నిజాన్ని అంగీకరించాలి'

ABOUT THE AUTHOR

...view details