తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాష్ట్రపతి పదవిని ఆనాడే వద్దనుకున్న రుక్మిణీ! - రుక్మిణీ దేవి అరండల్​ రాష్ట్రపతి ప్రతిపాదన

Rukmini Devi Rejects President Post: దేశ రాష్ట్రపతి పదవిని చేపట్టే అవకాశం కోసం ఎంతో మంది సీనియర్​ రాజకీయ నాయకులు ఎదురుచూస్తుంటారు. ఒకవేళ అవకాశం వస్తే అమితానందంతో అంగీకరిస్తారు. కానీ, తమిళనాడుకు చెందిన నాట్యకళాకారిణి రుక్మిణీ దేవి అరండల్​ మాత్రం ఆనాడే రాష్టపతి పదవి వద్దనుకుని ప్రతిపాదనను తిరస్కరించారు.

PRESIDENT RUKHMINI
PRESIDENT RUKHMINI

By

Published : Jul 4, 2022, 8:54 AM IST

Rukmini Devi Rejects President Post: దేశ అత్యున్నత పీఠమైన రాష్ట్రపతి పదవిని చేపట్టే అవకాశం లభిస్తుందంటే సాధారణంగా ఎవరైనా ఆనందంతో అంగీకరిస్తారు. కానీ రుక్మిణీ దేవి అరండల్‌ మాత్రం ఆనాడే ఇలాంటి ప్రతిపాదనను తిరస్కరించారు. దేశ తొలి మహిళా రాష్ట్రపతిగా మహారాష్ట్రకు చెందిన ప్రతిభా పాటిల్‌ చరిత్రలో నిలిచిపోయిన సంగతి మనందరికీ తెలుసు. తాజాగా ఎన్నికలు జరుగుతున్న వేళ.. మరో మహిళ ద్రౌపదీ ముర్ము కూడా బరిలో కీలకంగా ఉన్నారు.

.

అయితే 1977లోనే ఓ మహిళను ప్రథమ పౌరురాలిగా ఎన్నుకోవడానికి ప్రయత్నం జరిగింది. నాటి జనతా ప్రభుత్వ హయాంలో ప్రధాని మొరార్జీ దేశాయ్‌ ఈ దిశగా ఆలోచన చేశారు. తమిళనాడుకు చెందిన ప్రముఖ నాట్య కళాకారిణి రుక్మిణీ దేవి అరండల్‌ను జనతా పార్టీ తరఫున అభ్యర్థిగా ఎంపిక చేయాలని ఆయన భావించారు. అరండల్‌ గతంలో రెండుసార్లు రాజ్యసభ సభ్యురాలి (నామినేటెడ్‌)గా పనిచేశారు. కానీ మొరార్జీ ప్రతిపాదనను ఆమె తిరస్కరించారు. దీంతోపాటు అధికార జనతా పార్టీలోనూ ఆయన ప్రతిపాదనకు తగినంత మద్దతు లభించలేదు. దీంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది.

మరోవైపు, 2022 రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్​ ఉపసంహరణ గడువు ముగిసింది. 94 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్​ సిన్హాలు మాత్రమే ప్రస్తుతం రేసులో ఉన్నారు. దాఖలైన 115 నామినేషన్​లలో 107 పత్రాలను రాజ్యసభ ప్రధాన కార్యదర్శి, రిటర్నింగ్​ ఆఫీసర్ పీసీ మోదీ తిరస్కరించారు. నిబంధనలకు తగినట్టు లేకపోవడమే అందుకు కారణం. జులై 18న ఓటింగ్​ను పార్లమెంట్​లోని 63 నెంబరు గదిలో నిర్వహిస్తామని.. రాష్ట్ర అసెంబ్లీలలో నిర్దేశించిన రూముల్లో జరుపుతామని వెల్లడించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఓటింగ్​ సాగుతుందని పేర్కొన్నారు. జులై 24తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ పదవీకాలం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో జులై 18న కొత్త రాష్ట్రపతి ఎన్నిక కోసం.. ఓటింగ్ నిర్వహిస్తారు. 21న కౌంటింగ్​ చేపట్టనున్నారు. జులై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు.

ఇవీ చదవండి:రాష్ట్రపతి రబ్బర్‌ స్టాంపేనా?.. అసలీ పేరెలా వచ్చింది?

నామినేషన్​ ఉపసంహరణ గడువు పూర్తి.. రాష్ట్రపతి రేసులో ఇక ఇద్దరే!

ABOUT THE AUTHOR

...view details