తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా నెగెటివ్‌ రిపోర్ట్​ ఉంటేనే ఆ రాష్ట్రంలోకి ఎంట్రీ! - ఆర్​టీపీసీఆర్​ రిపోర్టు

దేశంలో కరోనా కోరలు చాస్తోన్న వేళ హిమాచల్​ప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. కేసులు పెరుగుతున్న ఏడు రాష్ట్రాల నుంచి ఎవరైనా తమ రాష్ట్రానికి రావాలంటే కచ్చితంగా ఆర్​టీ- పీసీఆర్​ నెగెటివ్‌ రిపోర్టు తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసింది.

rt-pcr report is mandatory for entering himachal pradesh
ఆర్టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ నివేదిక ఉంటేనే ఆ రాష్ట్రంలోకి ఎంట్రీ

By

Published : Apr 12, 2021, 6:41 AM IST

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న ఏడు రాష్ట్రాల నుంచి ప్రజలు ఎవరైనా హిమాచల్‌ప్రదేశ్‌ రావాలంటే కచ్చితంగా ఆర్‌టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టు కలిగి ఉండడాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకుర్‌ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంతకుముందు ఆయన కరోనా పరిస్థితిపై చర్చించేందుకు ఉన్నత అధికారులతో భేటీ అయ్యారు.

పంజాబ్‌, దిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌, కర్ణాటక, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ల నుంచి వచ్చే ప్రయాణికులు 72 గంటలు మించని ఆర్‌టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ నివేదికను చూపాల్సి ఉంటుంది తెలిపారు. ఈ నెల 16 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి :కరోనా కట్టడిలో ఆ మూడు రాష్ట్రాల్లో లోపాలివే..!

ABOUT THE AUTHOR

...view details