తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శబరిమల దర్శనం- పిల్లలకు ఆర్‌టీపీసీఆర్‌ తప్పనిసరి కాదు

sabarimala news today: శబరిమల తీర్థయాత్రలో పాల్గొనే చిన్నారులకు ఆర్‌టీపీసీఆర్‌ టెస్టు తప్పనిసరి కాదని కేరళ ప్రభుత్వం తెలిపింది. కరోనా నిబంధనలు మాత్రం తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.

sabarimala news today
శబరిమల తీర్థయాత్ర

By

Published : Nov 27, 2021, 4:16 PM IST

sabarimala news today: శబరిమల తీర్థయాత్రకు వచ్చే చిన్నారులకు ఆర్​టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి కాదని కేరళ ప్రభుత్వం తెలిపింది. శానిటైజర్లు, సబ్బులు పిల్లలకు ప్రత్యేకంగా ఉండేలా వారి వెంట వచ్చే పెద్దలు చూసుకోవాలని తాజాగా విడుదల చేసిన ఆదేశాల్లో స్పష్టం చేసింది. భౌతిక దూరం పాటించాలని పేర్కొంది.

తీర్థయాత్రలో పాల్గొనే భక్తులు, సిబ్బందికి టీకా రెండు డోసులు తప్పనిసరి చేసింది ప్రభుత్వం. లేదా ప్రయాణానికి 72 గంటల ముందు ఆర్​టీపీసీఆర్​ నెగెటివ్ రిపోర్ట్ చూపించాల్సి ఉంటుందని తెలిపింది. నవంబర్ 16 నుంచి ప్రారంభమైన శబరి యాత్రలో (Sabarimala News) భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. వర్షాలు, కరోనా నేపథ్యంలో ఇంతకు ముందులానే వర్చువల్​ క్యూ పద్దతిలో భక్తులను అనుమతిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details