RSS on Muslim: భాజపా పాలనలోనే ముస్లింలు అత్యంత ఆనందంగా, భద్రంగా ఉన్నారని... ఆర్‌ఎస్‌ఎస్ ముస్లిం విభాగం 'ముస్లిం రాష్ట్రీయ మంచ్' పేర్కొంది. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలు వారిని కేవలం ఓటు బ్యాంకుగానే చేశాయని విమర్శించింది. ఆ పార్టీల పాలనలో మైనార్టీలకు పేదరికం, నిరక్షరాస్యత, వెనుకబాటుతనంతో పాటు... ముమ్మారు తలాక్ వంటి వేధింపులే మిగిలాయని పేర్కొంది.
'భాజపా పాలనలోనే ముస్లింలకు అత్యంత ఆనందం, భద్రత' - ఆర్‌ఎస్‌ఎస్
RSS on Muslim: కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తాయని ఆర్‌ఎస్‌ఎస్ పేర్కొంది. వాళ్లంతా భాజపా పాలనలోనే ముస్లింలు అత్యంత ఆనందంగా, భద్రంగా ఉన్నారని వ్యాఖ్యానించింది.
RSS
దేశంలోని ముస్లింల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్రాల్లోని భాజపా ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశ పెట్టాయని వివరించింది. శాసనసభ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లోని ముస్లింలు భాజపాకే ఓటు వేయాలని అభ్యర్థించింది. ఈ మేరకు ముస్లిం రాష్ట్రీయ మంచ్ 'నివేదన పత్రాన్న' ముద్రించి పంపిణీ చేస్తోంది.
ఇదీ చదవండి:శత్రువులను ఏమార్చేలా.. భారత సైన్యానికి కొత్త యూనిఫాం