తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Infosys RSS: ఇన్ఫోసిస్‌పై 'ఆరెస్సెస్' గురి- ఏం జరుగుతోంది?

ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్​పై.. ఆరెస్సెస్(infosys rss) అనుబంధ వారపత్రిక తీవ్రమైన విమర్శనాత్మక కథనం ప్రచురించింది. ఐటీ, జీఎస్టీ పోర్టల్​లో లోపాలు(IT portal issues) తలెత్తడంపై మండిపడింది. 'పేరు గొప్ప, ఊరు దిబ్బ' అంటూ విరుచుకుపడింది. ఇలాంటి నిర్వాకంతో కొన్ని గ్యాంగులు లబ్ధి పొందుతాయని ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలకు ఆధారాలు లేవని కూడా చెప్పడం గమనార్హం.

RSS-INFOSYS
ఆరెస్సెస్ ఇన్ఫోసిస్

By

Published : Sep 5, 2021, 10:25 AM IST

ఇన్ఫోసిస్‌ కంపెనీ రూపొందించిన ఐటీ, జీఎస్టీ పోర్టల్స్‌లో పలు లోపాలు(IT portal issues) తలెత్తడంపై రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (RSS) అనుబంధ వారపత్రిక (rss weekly magazine) 'పాంచజన్య' తీవ్రమైన దాడికి దిగింది. ఈ లోపాల ఆధారంగా జాతివ్యతిరేక శక్తులు భారత ఆర్థిక ప్రయోజనాలు దెబ్బ తీస్తే ఎలాగంటూ నిలదీసింది.

మార్కెట్లోకి వచ్చిన ఈ పత్రిక తాజా సంచికలో 'సాఖ్‌ ఔర్‌ ఆఘాత్‌' (ఘనకీర్తి.. అప్రదిష్ఠ) శీర్షికతో ఇన్ఫోసిస్‌పై(infosys rss) నాలుగు పేజీల ముఖచిత్ర కథనం ఇచ్చారు. సంస్థ వ్యవస్థాపకులు నారాయణమూర్తి చిత్రాన్ని కవర్‌పేజీపై ముద్రించారు. బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న(infosys headquarters) ఇన్ఫోసిస్‌పై 'ఊంచీ దుకాన్‌, ఫీకా పక్వాన్‌' (పేరు గొప్ప, ఊరు దిబ్బ) అంటూ పత్రిక విరుచుకుపడింది.

ఆధారాల్లేని ఆరోపణలు

ఇన్ఫోసిస్‌ చేసే ఇటువంటి నిర్వాకాలతో పలు సందర్భాల్లో నక్సలైట్లు, లెఫ్టిస్టులు, కొన్ని గ్యాంగులు లబ్ధి పొందాయంటూ కథనంలో తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణలకు తమ వద్ద బలమైన ఆధారాలు లేవని కూడా స్పష్టం చేశారు. 'తన విదేశీ ఖాతాదారులకు కూడా ఈ సంస్థ ఇలాంటి నిరర్థక సేవలే అందిస్తుందా?' అని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:'పాఠశాలలు తెరిచినప్పుడు కోర్టులు ఎందుకు తెరవరు?'

ABOUT THE AUTHOR

...view details