RSS leader murder: ఆర్ఎస్ఎస్ నేతను నరికి చంపారు దుండగులు. ఈ ఘటన కేరళలోని పాలక్కడ్‌లో శనివారం మధ్యాహ్నం జరిగింది. ఐదుగురు దుండగులు రెండు బైక్‌లపై వచ్చి హత్య చేశారని పోలీసులు తెలిపారు. మృతుడ్ని ఆర్ఎస్ఎస్ మాజీ షరీక్ శిక్షణ్ ప్రముఖ్ శ్రీనివాసన్‌గా(45) పోలీసులు గుర్తించారు. శ్రీనివాసన్ ఒక్కడే దుకాణంలో ఉన్న సమయంలో ఈ దాడి జరిగిందని వెల్లడించారు. బాధితుడిని వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు.
ఆర్ఎస్ఎస్ నాయకుడు దారుణ హత్య.. బైక్‌పై వచ్చి నరికి.. - rss leader death
RSS leader murder: కేరళలో ఆర్ఎస్ఎస్ నాయకుడ్ని హత్య చేశారు దుండగులు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం జరిగిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఆరెస్సెస్ కార్యకర్తను చంపిన దుండగులు
ఈ ఘటనా స్థలానికి సమీపంలోనే 24 గంటలు క్రితం ఓ హత్య జరిగింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకుడు సుబైర్(43) ను నరికి చంపారు దుండగులు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన మసీదులో ప్రార్థనలు అనంతరం ఇంటికి తిరిగి వస్తుండగా ఎలపుల్లి వద్ద హత్య చేశారు. మరోవైపు శ్రీనివాసన్ హత్య వెనుక పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తాలుకా రాజకీయ శాఖ అయిన సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్డీపీఐ) ఉందని భాజపా ఆరోపించింది.