తమిళనాడు తూతుక్కుడిలో భారీ మొత్తంలో కొకైన్ పట్టుకున్నారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు. వీఓసీ పోర్టు ప్రాంతంలో మంగళవారం 400 కేజీల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీని విలువ దాదాపు రూ. 1000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు.
రూ.1000 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం - శ్రీలంక నౌకలో కొకైన్
తమిళనాడులో 400 కేజీల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. 1000 కోట్లు పలుకుతుందని అంచనా వేస్తున్నారు.
![రూ.1000 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం cocaine seized](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11482409-thumbnail-3x2-cocaine.jpeg)
కొకైన్ పట్టివేత, కొకైన్ సీజ్
శ్రీలంక నుంచి కొన్ని కంటైనర్లతో వచ్చిన నౌకలో తనిఖీలు చేపట్టారు అధికారులు. ఈ నేపథ్యంలో ఓ కంటైనర్లో.. బ్యాగుల్లో ప్యాక్ చేసి ఉంచిన హెరాయిన్‌ను గుర్తించారు. ప్రస్తుతం ఈ మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న ముఠాను గుర్తించే పనిలో ఉన్నట్లు పేర్కొన్నారు.