రాష్ట్రాల హక్కుల పరిరక్షణ, దేశాభివృద్ధికి రాజ్యసభ ఎంతో కృషి చేసిందని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రశంసించారు. ఇదే రోజున(మే 13) మొదటి రాజ్యసభ కొలువు తీరిందని ఆయన గుర్తుచేసుకున్నారు. ఎగువసభ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
'రాష్ట్రాల హక్కుల పరిరక్షణలో రాజ్యసభ భేష్' - రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
రాష్ట్రాల హక్కుల్ని కాపాడడంలో రాజ్యసభ కృషి ఎనలేనిదని రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. 1952లో ఇదే రోజున(మే 13) మొదటి రాజ్యసభ సమావేశం జరిగిందని గుర్తుచేసుకున్నారు.

వెంకయ్యనాయుడు
1952 ఏప్రిల్ 3న రాజ్యసభ ఏర్పాటైంది. మే 13న కొలువు తీరింది. ప్రస్తుతం 253వ రాజ్యసభ కొలువుతీరి ఉంది.