తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వీడియో తెచ్చిన తంటాలు.. రూ.12 వేలు ఫైన్​!

సరదాగా తీసిన వీడియో వారికి చిక్కులు తెచ్చి పెట్టింది. కామెడీ కోసం చేసిన ఆ వీడియో ఆధారంగా ఏకంగా రూ.12000 ట్రాఫిక్​ చలానా​ విధించారు పోలీసులు. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? ఎందుకని ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు?

bike tiktok vedio
టిక్​టాక్ వీడియోతో భారీ ట్రాఫిక్ ఛలాన్

By

Published : Oct 17, 2021, 1:46 PM IST

Updated : Oct 17, 2021, 2:02 PM IST

వీడియో తెచ్చిన తంటాలు

సరదాగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​ అయితే.. మురిసిపోతాం కదా! ఎన్ని లైకులు, కామెంట్లు వచ్చాయో లెక్కేసుకుని మరీ సంబరపడిపోతాం. కానీ ఇలా వైరల్ అయిన వీడియో ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​లోని యువకులకు మాత్రం కొత్త తంటాలు తెచ్చి పెట్టింది. వీడియో ఆధారంగా ట్రాఫిక్​ పోలీసులు వారికి రూ.12,000 జరిమానా విధించారు.

టిక్​టాక్ వీడియోతో భారీ ట్రాఫిక్ ఛలాన్

ఆ వీడియోలో నలుగురు యువకులు ఒకే బైక్​పై ప్రయాణిస్తుంటారు. అప్పటికే ఇరుకుగా కూర్చుని పోతుండగా.. దారి మధ్యలో మరొక యువకుడు లిఫ్ట్​ అడుగుతాడు. బైక్​పై స్థలం లేకపోవటంతో.. లిఫ్ట్ అడిగిన యువకున్ని ఆ నలుగురు యువకులు చేతుల్లో పట్టుకుని నిర్లక్ష్యంగా ప్రయాణిస్తారు. ఇలా ఐదుగురు ఒకే బైక్​పై వెళ్తారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పోలీసుల దృష్టికి వెళ్లింది. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినందుకు యువకులు ప్రయాణించిన బైక్​ నెంబర్​ ఆధారంగా రూ.12,000 జరిమానా విధించారు.

టిక్​టాక్ వీడియోతో భారీ ట్రాఫిక్ ఛలాన్

ఇదీ చదవండి:సిగరెట్టుకు డబ్బులు అడిగారని కొట్టి చంపేశారు!

Last Updated : Oct 17, 2021, 2:02 PM IST

ABOUT THE AUTHOR

...view details