తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.7 కోట్లు విలువైన బంగారు ఆభరణాలు చోరీ

muthoot finance
రూ. 7 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ

By

Published : Jan 22, 2021, 2:01 PM IST

Updated : Jan 22, 2021, 2:22 PM IST

13:54 January 22

రూ. 7 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ

పోలీసుల దర్యాప్తు

తమిళనాడులో భారీ దొంగతనం జరిగింది. క్రిష్ణగిరి జిల్లా హోసూర్​-బగలూరు రోడ్డు వద్ద ఉన్న ముతూట్​ ఫైనాన్స్​ బ్రాంచ్​లోకి చొరబడ్డ దుండగులు.. పెద్ద మొత్తంలో బంగారం ఎత్తుకెళ్లారు. దీని విలువ సుమారు రూ. 7 కోట్లకుపైనే ఉంటుందని తెలుస్తోంది.

గన్​తో బెదిరించి.. కట్టేసి..

రోజూ మాదిరిగానే శుక్రవారం ఉదయం బ్రాంచ్​ను తెరిచారు సిబ్బంది. కాసేపటికే కస్టమర్ల రూపంలో లోపలికి ప్రవేశించారు దుండగులు. ఆ సమయంలో నలుగురు ఉద్యోగులు మాత్రమే ఉండగా.. వారిని గన్​తో బెదిరించి కట్టేశారు. అనంతరం లాకర్​ తాళం తీసుకుని.. సుమారు 25కేజీలకుపైగా బంగారాన్ని, రూ. 90 వేల నగదును ఎత్తుకెళ్లారు. 

ఇతర ఉద్యోగులు, సిబ్బంది ఆఫీసుకు వచ్చాక అసలు విషయం బయటపడింది. కట్టేసి ఉన్న నలుగురిని విడిపించి.. పోలీసులకు సమాచారం అందించారు. 

ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు.. దర్యాప్తు చేస్తున్నారు. బంగారు ఆభరణాల విలువనే రూ. 7 కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రస్తుతం వారికోసం గాలిస్తున్నారు. 

Last Updated : Jan 22, 2021, 2:22 PM IST

ABOUT THE AUTHOR

...view details