Ticket for baby chick:బస్సులో భారీ వస్తువులను ఏవైనా తీసుకువెళితే.. అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందనే విషయం మనకు తెలుసు. అయితే.. సంచిలో కొడిపిల్లను తీసుకువెళితే కూడా టికెట్ తీసుకోవాలనే విషయం గురించి ఎప్పుడైనా విన్నారా? కర్ణాటకలో ఈ వింత సంఘటన జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ఓ కుటుంబం తమతోపాటు కోడిపిల్లను తీసుకువెళ్లిందని దానికి హాఫ్ టికెట్ కొట్టాడు కండక్టర్.
అసలేమైందంటే..?
Baby chick in bus: ఉత్తర కన్నడ జిల్లా సిద్ధపుర నుంచి ఓ సంచార జాతి కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు... రూ.10కి కోడి పిల్లను కొనుగోలు చేశారు. దాన్ని తీసుకుని వారు... హోసనగర నుంచి షిరూరుకు డిసెంబరు 31న ఆ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(కేఎస్ఆర్టీసీ) బస్సులో పయనమయ్యారు. హోసనగర వద్ద బస్సు ఎక్కిన వారు.. మూడు టికెట్లు కావాలని కండక్టర్ను అడిగారు.