తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జన్​ధన్​ ఖాతాలోకి రూ.15లక్షలు.. మోదీ ఇచ్చారనుకుని ఇల్లు నిర్మాణం.. కానీ...

15 lakh in jan dhan account: ఆ రైతు జన్​ధన్​ ఖాతాలో రూ.15లక్షలు జమయ్యాయి. 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టుగా నరేంద్ర మోదీనే డిపాజిట్ చేశారని ఆయన సంతోషపడ్డాడు. ధన్యవాదాలు చెబుతూ ప్రధాని కార్యాలయానికి మెయిల్​ కూడా పంపాడు. రూ.9లక్షలతో ఓ చిన్న ఇల్లు కట్టుకున్నాడు. మిగిలిన వాటిని ఏం చేద్దామా అని ఆలోచిస్తుండగా.. ఆయనకు పిడుగులాంటి వార్త అందింది.

15 lakh in jan dhan account
15 lakh in farmer account

By

Published : Feb 8, 2022, 7:11 PM IST

15 lakh in jan dhan account: తన జన్​ధన్​ ఖాతాలో జమైన లక్షల రూపాయలను ఖర్చు చేసిన రైతుకు పెద్ద చిక్కొచ్చి పడింది. ఆ డబ్బు తమదని, పొరపాటున తన ఖాతాలో జమైందని, తక్షణమే చెల్లించాలని గ్రామ పంచాయతీ డిమాండ్ చేస్తోంది.

అంతా మోదీ చలవే!

Jan dhan account wrong deposits: ధ్యానేశ్వర్ జనార్ధన్ ఔటే.. మహారాష్ట్ర ఔరంగాబాద్​ పైఠన్​ తాలూకా దావర్​వాడీ గ్రామానికి చెందిన ఓ రైతు. కొంతకాలం క్రితం తన బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్​ చెక్ చేసుకుని ఒక్కసారిగా షాక్ అయ్యాడు. జీరో బ్యాలెన్స్​ జన్​ధన్​ ఖాతాలో ఏకంగా రూ.15లక్షలు ఉండడమే అందుకు కారణం. అప్పుడే ధ్యానేశ్వర్​కు 2014 ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ ప్రచారం గుర్తొచ్చింది. 'ప్రతి పేదవాడి బ్యాంకు ఖాతాలో రూ.15లక్షలు జమ' అనే నినాదం అతడి చెవుల్లో మార్మోగింది. అసలే అది ప్రధాన మంత్రి జన్​ధన్​ యోజన కింద తెరిచిన ఖాతా.. అందులోనూ రూ.15లక్షలు... రెండూ సరిపోయాయి. ఈ డబ్బంతా మోదీనే తన ఖాతాలో జమ చేశారని సంబరపడిపోయాడు ధ్యానేశ్వర్.

ధ్యానేశ్వర్

15 lakh credited to farmer bank ac:

ధ్యానేశ్వర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. చుట్టుపక్కల వారంతా అతడ్ని అభినందనలతో ముంచెత్తారు. ధ్యానేశ్వర్​ వెంటనే ప్రధాని కార్యాలయానికి ఓ ఈమెయిల్​ పంపాడు. ఎన్నికల హామీని నెరవేర్చుతూ, తన ఖాతాలో రూ.15లక్షల జమ చేసినందుకు మోదీకి ధన్యవాదాలు తెలిపాడు. తన ఖాతాలోని సొమ్ము నుంచి రూ.9లక్షలు తీసి.. గ్రామంలో ఓ చిన్న ఇల్లు కట్టుకున్నాడు. మిగిలిన రూ.6లక్షలను ఖర్చు చేయాలా, దాచుకోవాలా అని ఆలోచిస్తున్నాడు.

రైతు కట్టుకున్న ఇల్లు

తూచ్... అది మా డబ్బు...

ఒక్కసారిగా లక్షలు వచ్చాయన్న ఆశ్చర్యం, సొంతింట కల నెరవేరిందన్న ఆనందం మధ్య ధ్యానేశ్వర్​కు ఓ లేఖ అందింది. "జిల్లా పరిషత్​ నుంచి పింపల్​వాడీ గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులు పొరపాటున మీకు వచ్చాయి. ఆ డబ్బు మొత్తాన్ని సత్వరమే తిరిగి చెల్లించాలి" అన్నది ఆ లేఖ సారాంశం. ఇది చదివిన వెంటనే అతడి​ గుండె పగిలినంత పనైంది. తన ఖాతాలో మిగిలి ఉన్న రూ.6లక్షలను తక్షణమే తిరిగి చెల్లించేసినా.. ఇంటి కోసం ఇప్పటికే ఖర్చు చేసిన రూ.9లక్షలను ఎలా ఇవ్వాలా అని తలపట్టుకుంటున్నాడు ధ్యానేశ్వర్.

ఇదీ చదవండి:మెటావర్స్​లో వివాహ రిసెప్షన్.. దేశంలో ఇదే మొదటిసారి!

ABOUT THE AUTHOR

...view details