దిల్లీ నుంచి బిహార్‌లోని జయనగర్‌కు ప్రయాణిస్తున్న స్వతంత్ర సంగ్రామ్ సేనాని ఎక్స్‌ప్రెస్ నుంచి అధికారులు రూ.1.4 కోట్ల నగదు ఉన్న బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది.
రైలు సోమవారం రాత్రి ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్ చేరుకున్న సమయంలో పాంట్రీ కారులో ఈ బ్యాగు ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. నగదును లెక్కించే వరకు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. మంగళవారం రాత్రి ఆదాయ పన్ను శాఖ అధికారులకు సమాచారం అందించారు.