RRC WCR Apprentice Jobs 2023 : పదో తరగతి, ఐటీఐ పూర్తి చేసి రైల్వేలో అప్రెంటీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతీయువకులకు శుభవార్త. వెస్ట్ సెంట్రల్ రైల్వేలో మొత్తం 3,015 అప్రెంటీస్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ)- వెస్ట్ సెంట్రల్ రైల్వే డబ్ల్యూసీఆర్ పరిధిలోని యూనిట్‌లలో శిక్షణ కోసం ఆసక్తిగల ఆశావాహులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హతలు (RRC WCR Apprentice Jobs Eligibility)
పదో తరగతితో పాటు ఐటీఐ సంబంధిత ట్రేడ్‌లో అభ్యర్థులు ఉత్తీర్ణులై ఉండాలి.
ట్రేడ్‌లు (RRC WCR Apprentice Jobs Trades)
- మెకానిక్
- అప్రెంటిస్ ఫుడ్ ప్రొడక్షన్
- అసిస్టెంట్ ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్
- బ్లాక్‌స్మిత్
- బుక్ బైండర్
- కేబుల్ జాయింటర్
- కార్పెంటర్
- కంప్యూటర్ నెట్‌వర్కింగ్ టెక్నీషియన్
- డెంటల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్
- డీజిల్ మెకానిక్
- డిజిటల్ ఫొటోగ్రాఫర్
- డ్రాఫ్ట్స్‌మ్యాన్
- ఎలక్ట్రీషియన్
- ఫిట్టర్
- హౌస్ కీపర్
- మెషినిస్ట్
- మాసన్
- పెయింటర్
- ప్లంబర్
- స్టెనోగ్రాఫర్
- టర్నర్
- వెల్డర్
- వైర్‌మ్యాన్
ఈ డివిజన్ లేదా యూనిట్లు (RRC WCR Apprentice Vacancy Divisions)
- జేబీపీ డివిజన్
- బీపీఎల్ డివిజన్
- కోటా డివిజన్
- సీఆర్‌డబ్ల్యూఎస్ బీపీఎల్
- డబ్ల్యూఆర్‌ఎస్ కోటా
- హెచ్‌క్యూ/ జేబీపీ
ఏజ్ లిమిట్!
RRC WCR Apprentice Jobs Age Limit :2023 డిసెంబర్ 14 నాటికి అభ్యర్థులు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం(RRC WCR Apprentice Jobs Selection Process)
- పదో తరగతి మార్కులు
- ఐటీఐ మార్కులు
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.