తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Railway Jobs 2023 : 3,600 రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్​..​ ఎగ్జామ్​ లేకుండానే జాబ్​! - ఆర్​ఆర్​సీ ఉద్యోగాలు

RRC Recruitment 2023 : రైల్వే రిక్రూట్​మెంట్​ సెల్​ (వెస్ట్రన్ రీజియన్​) 3624 అప్రెంటీస్​ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ తదితర పూర్తి వివరాలు మీ కోసం.

RRC Recruitment 2023
RRC WR Apprentice Recruitment 2023

By

Published : Jun 24, 2023, 10:42 AM IST

RRC Recruitment 2023 : భారతీయ రైల్వేస్​లో ఉద్యోగం చేయాలని ఆశించే అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. ముంబయి ప్రధాన కేంద్రంగా గల రైల్వే రిక్రూట్​మెంట్​ సెల్​ (వెస్ట్రన్​ రీజియన్​) భారీ నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్​ ద్వారా వెస్ట్రన్​ రైల్వే పరిధిలోని డివిజన్ / వర్క్​షాప్​ల్లో మొత్తం 3624 అప్రెంటీస్​ పోస్టులు భర్తీ చేయనున్నారు.

అప్రెంటీస్​ పోస్టుల వివరాలు
RRC WR Apprentice Vacancy Details 2023 :

  • బీసీటీ డివిజన్​ - 745
  • బీఆర్​సీ డివిజన్​ - 434
  • ఓడీఐ డివిజన్ - 624
  • ఆర్​టీఎమ్​ డివిజన్​ - 415
  • ఆర్​జేటీ డివిజన్​ - 165
  • బీవీపీ డివిజన్​ - 206
  • పీఎల్​ డబ్ల్యూ/షాప్​ - 392
  • ఎమ్​ఎక్స్​ డబ్ల్యూ/షాప్ - 77
  • బీవీపీ డబ్ల్యూ/షాప్ - 112
  • డీహెచ్​డీ డబ్ల్యూ/షాప్ - 263
  • పీఆర్​టీఎన్​ డబ్ల్యూ/షాప్ - 72
  • ఎస్​బీఐ ఈఎన్​జీజీ డబ్ల్యూ/షాప్ - 60
  • ఎస్​బీఐ సిగ్నల్​ డబ్ల్యూ/షాప్ - 25
  • హెడ్​ క్వార్టర్​ ఆఫీసర్​ - 35

రైల్వే అప్రెంటీస్​ - ట్రేడ్​ వివరాలు
RRC WR Apprentice : రైల్వే రిక్రూట్​మెంట్​ సెల్​ (వెస్ట్రన్​ రీజియన్​)లో.. ఫిట్టర్​, వెల్డర్​, కార్పెంటర్​, పెయింటర్​, డీజిల్​ మెకానిక్​, మోటార్​ వెహికల్​ మెకానిక్​, ఎలక్ట్రీషియన్​, ఎలక్ట్రానిక్​ మెకానిక్​, వైర్​మ్యాన్​, మెకానిక్ రిఫ్రిజిరేటర్​ (ఏసీ మెకానిక్​), పైప్​ ఫిట్టర్​, ప్లంబర్, డ్రాఫ్ట్స్​మ్యాన్ (సివిల్​), పీఏఎస్​ఎస్​ఏ, స్టెనోగ్రాఫర్​, మెషినిస్ట్​, టర్నర్​ మొదలైన ట్రేడుల్లో అప్రెంటిస్​లను నియమించనున్నారు.

విద్యార్హతలు ఏమిటి?
RRC WR Educational Qualification :ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్​ నుంచి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే తప్పనిసరిగా సంబంధిత ట్రేడ్​లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి వివరాలు
RRC WR Age limit : 2023 జులై 26 నాటికి అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము ఎంత?
RRC WR Application Fee : అభ్యర్థులు అప్లికేషన్​ ఫీజుగా రూ.100 చెల్లించాలి. ఇది రిఫండ్​ కాదు. అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీల వారికి, మహిళలకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఇచ్చారు.

ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
RRC WR Selection Process :అభ్యర్థుల 10వ తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల సగటు ఆధారంగా మెరిట్​ లిస్ట్​ ప్రిపేర్​ చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష/ వైవా ఉండవు.

శిక్షణ ఎంత కాలం ఉంటుంది?
RRC WR Training Period : అప్రెంటిస్​ పోస్టులకుఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాది పాటు శిక్షణ ఇస్తారు.

దరఖాస్తు ప్రక్రియ
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్​సైట్​ https://www.rrc-wr.com/ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు
RRC WR Recruitment important dates :

  • దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 2023 జూన్​ 27
  • దరఖాస్తుకు చివరి తేదీ : 2023 జులై 26

రైల్వే ఉద్యోగాలపై ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం రైల్వే రిక్రూట్​మెంట్​ సెల్​ (వెస్ట్రన్​ రీజియన్​) అధికారిక వెబ్​సైట్​ https://www.rrc-wr.com/ ​ను సందర్శించండి.

ABOUT THE AUTHOR

...view details