RRC NCR Apprentice Jobs 2023 : నార్త్ సెంట్రల్ రైల్వే (RRC NCR) 1697 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు నార్త్ సెంట్రల్ రైల్వేకు చెందిన వివిధ డివిజన్లు/ యూనిట్లలో పనిచేయాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
NCR Apprentice Vacancy Details :
- ప్రయాగ్‌రాజ్ డివిజన్ - 364 పోస్టులు
- ELECT డిపార్ట్మెంట్ - 339 పోస్టులు
- ఝాన్సీ డివిజన్ - 528 పోస్టులు
- వర్క్‌షాప్ ఝాన్సీ - 170 పోస్టులు
- ఆగ్రా డివిజన్ - 296 పోస్టులు
- మొత్తం పోస్టులు - 1697
విద్యార్హతలు
NCR Apprentice Qualifications :అభ్యర్థులు 10వ తరగతిలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాలయం నుంచి ఆయా పోస్టులకు అనుగుణంగా ఐటీఐ చేసి ఉండాలి.
వయోపరిమితి
NCR Apprentice Age Limit :అభ్యర్థుల వయస్సు 15 ఏళ్లు నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి.
దరఖాస్తు రుసుము
NCR Apprentice Application Fee :అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు దరఖాస్తు రుసుము నుంచి పూర్తి మినహాయింపు కల్పించారు. కనుక వారు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.