తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైల్వే పరీక్షల్లో అవకతవకలు- నేడు ఆ రాష్ట్ర బంద్​! - ఆర్​ఆర్​బీ ఎన్టీపీసీ పరీక్షల్లో అవకతవకలు

RRB NTPC protest: ఆర్​ఆర్​బీ పరీక్షల్లో 'అక్రమాల'పై నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా బిహార్​లోని విద్యార్థి సంఘాలు శుక్రవారం బంద్​కు పిలుపునిచ్చాయి.

RRB NTPC protest Students unions call Bihar Bandh on Jan 28
రాష్ట్ర బంద్​కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు.!

By

Published : Jan 28, 2022, 6:28 AM IST

Updated : Jan 28, 2022, 6:45 AM IST

RRB NTPC protest: ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. పలు విద్యార్థి సంఘాలు రాష్ట్ర బంద్​కు పిలుపునిచ్చాయి. ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్షాల మహాకూటమి ఈ బంద్​కు మద్దతు ప్రకటించింది. ఫిర్యాదులను పరిశీలించేందుకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ నిరసనకారులు ఆందోళనను విరమించలేదు. అంతేగాకుండా ఈ కమిటీ ఏర్పాటు చేయడం ఒట్టి బూకటంగా పేర్కొన్నాయి.

ఉత్తర్​ప్రదేశ్​లో ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ విషయాన్ని పక్క దోవ పట్టించేందుకే కమిటీ ఏర్పాటు చేసినట్లు విద్యార్థి సంఘం ఏఐఎస్​ఏ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సందీప్ సౌరవ్ ఆరోపించారు. అభ్యర్థులు అడుగుతున్న ప్రశ్నలకు కచ్చితంగా శాఖాధికారులు సమాధానం చెప్పి తీరాలని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగంతో ఇప్పటికే విద్యార్థులు సతమతమవుతున్నారని తెలిపారు. యూపీలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో పుట్టుకొచ్చిన ఈ ఉద్యమాన్ని ఆపేందుకు కమిటీ పేరుతో ప్రభుత్వం నాటకాలాడుతుందన్నారు. ఈ కారణంగా ఎన్నికలు పూర్తయ్యేవరకు సమస్యను వాయిదా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ కుట్ర పన్నుతున్నాయని మండిపడ్డారు.

Last Updated : Jan 28, 2022, 6:45 AM IST

ABOUT THE AUTHOR

...view details