తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రౌడీషీటర్​ అత్యాచార యత్నం.. పోలీసుల కాల్పులు - మధురైలో రౌడీ షీటర్​పై పోలీసులు కాల్పులు

ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారానికి యత్నించిన ఓ రౌడీ షీటర్​పై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో నిందితుడి కాలిలోకి బులెట్​ దిగింది. ఈ ఘటన తమిళనాడులోని మధురైలో (Madurai News) జరిగింది.

Rowdy shot and caught by police
రౌడీ షీటర్‌ కురువి విజయ్‌

By

Published : Nov 13, 2021, 7:09 PM IST

మహిళపై అఘాయిత్యానికి యత్నించిన రౌడీషీటర్‌పై పోలీసులు కాల్పులు జరిపిన ఘటన తమిళనాడులో జరిగింది. మధురై (Madurai News)అన్నానగర్‌కి చెందిన కురువి విజయ్‌ అనే రౌడీ షీటర్‌ ఒంటరిగా వెళ్తున్న మహిళపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఈ క్రమంలో బాధితురాలు పెద్దగా కేకలు వేయటం వల్ల అప్రమత్తమైన స్థానికులు మహిళను రక్షించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు.

రౌడీ షీటర్‌ కురువి విజయ్‌

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా విజయ్‌ ప్రతిఘటించాడు. తన అనుచరులతో కలిసి పోలీసులపై దాడికి దిగాడు. ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు కాల్పులు జరపగా నిందితుడి కాలిలోకి తూటా దూసుకెళ్లింది. అనంతరం అతడ్ని అరెస్టు చేసిన పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:ప్రేమికుడితో వెళ్లిన బాలికకు గుండు కొట్టించి.. ఊరేగించి..

ABOUT THE AUTHOR

...view details