Rolls Royce Cbi Case : ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోళ్లలో అవినీతి ఆరోపణలపై బ్రిటిష్‌కు చెందిన ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీ రోల్స్ రాయిస్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్‌పైనా సీబీఐ కేసు నమోదు చేసింది. భారత నేవీ, ఎయిర్‌ఫోర్స్ కోసం హాక్ 115 అడ్వాన్స్ జెట్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోళ్ల కాంట్రాక్ట్ దక్కించుకునేందుకు.. రోల్స్ రాయిస్ లంచం ఇచ్చిందని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపించింది. రోల్స్ రాయిస్ ఇండియా డైరెక్టర్ టిమ్ జోన్స్‌తో పాటు మధ్యవర్తులైన సుధీర్ చౌధరి, అతని కుమారుడు భాను ఛౌదరి, రోల్స్ రాయిస్ పీఎల్‌సీ, బ్రిటిష్ ఏరోస్పేస్ సిస్టమ్స్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది సీబీఐ.
కాగా 24 హాక్ 115 ఏజీటీల కొనుగోళ్లకు రోల్స్ రాయిస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది భారత్. దీని విలువ 734.21 మిలియన్ బ్రిటిష్ పౌండ్లుగా ఉంది. అలాగే, 42 ఎయిర్ క్రాఫ్ట్‌ల తయారీకి, హిందుస్థాన్ ఎరో నాటిక్స్‌కు మెటీరియల్ సప్లయ్ చేసేందుకు 308.247 మిలియన్ డాలర్లు, లైసెన్స్ ఫీజు కింద మరో 7.5 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ డీల్ పూర్తి చేసేందుకు.. నిందితులు పలువురు ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చారని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపించింది.