చరిత్రాత్మకమైన అజ్మీర్ నగరం నడిబొడ్డున స్టేట్ మ్యూజియం ఉంది. అక్బర్ కాలంలో దీన్ని నిర్మించారు. బ్రిటిషర్ల బానిస పరిపాలనకు మొదటి అధ్యాయం అజ్మీర్ కోట నుంచే ప్రారంభమైంది. 1616 సంవత్సరంలో ఇంగ్లాండ్ రాజు జేమ్స్ -1 ఆదేశాలతో , థామస్ రో ఇదే కోటలో మొఘల్ చక్రవర్తి జహంగీరును కలిశారు. మనదేశంలో వాణిజ్య ఒప్పందానికి అనుమతి సాధనే ఈ సమావేశ ముఖ్యోద్దేశం.
ఈస్టిండియా కంపెనీ భారత్‌లో తన వ్యాపారం ప్రారంభించడానికి వచ్చింది. ఇంగ్లండ్ రాజ దూతగా థామస్ రో అజ్మీర్ రాజాను కలిశారు. ఈస్టిండియా కంపెనీ తన వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో, ఏ పద్దతిలో ముందుకెళ్లాలో నిర్ణయించే బాధ్యత, ముస్లీం రాజుల నుంచి అనుమతులు తీసుకునే బాధ్యత ఆయనపై ఉంచింది.
-నీరజ్ త్రిపాఠి, సర్కిల్ సూపరింటెండెంట్, ప్రభుత్వ మ్యూజియం, అజ్మీర్
గుజరాత్ లో కీలకమైన సూరత్ సహా దేశంలోని అనేక ముఖ్యకేంద్రాలలో ఫ్యాక్టరీల స్థాపనకు ఈస్టిండియా కంపెనీ మొఘల్ చక్రవర్తి జహంగీర్ ను అనుమతి కోరింది. కంపెనీ ప్రతినిధులతో అనేక సమావేశాల తర్వాత సంబంధిత ప్రతిపాదనలను జహంగీర్ ఆమెదించారు. ఈ ఒప్పందం మనదేశ చరిత్రగతినే మార్చివేసింది. వర్తక వాణిజ్యాలు, ఫ్యాక్టరీల ఏర్పాటు పేరుతో కాలుమోపిన ఈస్టిండియా కంపెనీ ఈ దేశమంతా తన సామ్రాజ్యాన్ని నెలకొల్పుతుందనేనది అప్పటికీ ఎవరి ఊహకీ అందని విషయం. క్రమక్రమంగా, ఒక్కో ప్రాంతంలో తిష్టవేస్తూ..దేశమంతా సామ్రాజ్యాన్ని విస్తరించింది.
థామస్ రో ఎంతో ప్రయత్నంచేసి జహంగీర్‌ను ఒప్పించాడు. చాలాకాలం ఇక్కడే ఉండిపోయ జహంగీర్‌తో పలు దఫాలుగా చర్చించి సఫలమయ్యాడు. జహంగీర్ నుంచి ఫర్మానాను పొందాడు. ఈస్టిండియా కంపెనీ తన వ్యాపారాన్ని ఆరంభించడానికి అన్ని రకాలైన అనుమతులను రాజ ఆమోదాన్ని పొందగలిగారు.
-నీరజ్ త్రిపాఠి, సర్కిల్ సూపరింటెండెంట్, ప్రభుత్వ మ్యూజియం, అజ్మీర్
చౌహాన్ రాజవంశం అనంతరం అజ్మీర్‌ను రాజపుత్ర, మొఘల్, మరాఠాలు పరిపాలించారు. అజ్మీర్ కోట అనేక చారిత్రక సంఘటనలకు సాక్షిగా ఉంది. మొఘల్ చక్రవర్తి అక్బర్ అజ్మీర్ కోటలో ఉండి హల్దీఘాటి యుద్ధాన్ని ఇక్కడి నుంచే పర్యవేక్షించాడు. అనేక యుద్ధాలలో ఆరితేరిన యోధుడు, రాజపుత్రవీరుడు మాన్ తనపక్షాన యుద్ధానికి పంపించాడు.