తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ రోహింగ్యాలను మయన్మార్​కే పంపిస్తాం' - కాందిశీకులు, రోహింగ్యాలు

జమ్ము అధికారులు నిర్బంధించిన రోహింగ్యాలను మయన్మార్​కు అప్పగిస్తామని సుప్రీం కోర్టుకు కేంద్రం శుక్రవారం స్పష్టం చేసింది. ఈ మేరకు మయన్మార్​ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. దేశాన్ని అక్రమ వలసదారులకు రాజధానిగా మార్చనీయబోమని చెప్పింది.

supreme court
'ఆ రోహింగ్యాలను మయన్మార్​కే పంపిస్తాం'

By

Published : Mar 27, 2021, 5:58 AM IST

దేశాన్ని అక్రమ వలసదారుల రాజధాని గా మారనీయమని, రోహింగ్యాలను మయన్మార్​కు అప్పగిస్తామని కేంద్రం శుక్రవారం సుప్రీం కోర్టు ముందు స్పష్టం చేసింది. జమ్ము అధికారులు నిర్బంధించిన రోహింగ్యాలను వెంటనే విడుదల చేయాలని, వారిని మయన్మార్​కు అప్పగించకుండా నిరోధించాలంటూ దాఖలైన వ్యాజ్యంలో తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​.ఏ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం రిజర్వ్​లో ఉంచుతున్నట్లు ప్రకటించింది.

అంతకుముందు పిటిషనర్​ తరఫు న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​ వాదనలు వినిపిస్తూ.. రోహింగ్యాలను మయన్మార్​కు అప్పగించకూడదని, వారు కాందిశీకులని.. వారిని ఆ విధంగానే చూడాలని తెలిపారు. ఈ వాదనలను సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా తీవ్రంగా ఖండించారు. రోహింగ్యాలు, కాందిశీకులు కాదని, అక్రమ వలసదారులని పేర్కొన్నారు. వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ భారత్​లో ఉంచబోమని చెప్పారు. మయన్మార్​ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని.. వారు తమ పౌరులేనని ఆ దేశం అంగీకరిస్తే, వెంటనే వారిని పంపిస్తామని స్పష్టం చేశారు. దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ వలసదారులకు రాజధానిగా మారనీయమని తెలిపారు.

ఇదీ చూడండి:ఎన్నికల బాండ్ల విక్రయంపై స్టేకు సుప్రీం నిరాకరణ

ABOUT THE AUTHOR

...view details