Rod And Stones On Vande Bharat Railway Track :వందేభారత్ రైలుకు భారీ ప్రమాదం తప్పింది. పట్టాలపై ఇనుప రాడ్లు, రాళ్లను ఉంచారు గుర్తుతెలియని వ్యక్తులు. ముందే వీటిని గుర్తించిన లోకో పైలట్.. ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపారు. దీంతో వేలాది మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. రాజస్థాన్‌లోని చిత్తౌడగఢ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 7.50 గంటలకు ఉదయ్‌పుర్ నుంచి జైపుర్‌కు వందే భారత్ ఎక్స్ప్రెస్బయలుదేరింది. భిల్వాడా రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే పట్టాలపై రాడ్లు, రాళ్లు గుర్తించారు లోకోపెలట్. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును నిలిపివేశారు. కిందకు దిగి రైలు పట్టాలను పరిశీలించగా.. రాళ్లతోపాటు ఇనుపరాడ్లు ఉండటం గమనించారు. కొన్నిచోట్ల రాళ్లు కదలకుండా ఇనుపరాడ్లు కూడా ఉంచారు.
ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇది ఎవరైనా ఆకతాయిలు చేసిన పనా? లేదంటే దీని వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
రైలు పట్టాలకు పగుళ్లు.. ఎర్ర వస్త్రాన్ని చూపి వేల మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన రైతు..
Crack On Railway Track : కొద్ది రోజుల క్రితం కూడా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ భారీ రైలు ప్రమాదం తప్పింది. రైల్వే పట్టాలపై పగుళ్లు ఏర్పడ్డాయి. దీనిని గుర్తించిన ఓ రైతు.. ఎర్రని వస్త్రాన్ని లోకో పైలట్‌కు చూపుతూ రైలును ఆపాలని సూచించాడు. దీంతో వేల మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ నుంచి లఖ్‌నవూకు బయలుదేరిన గోమతి ఎక్స్‌ప్రెస్‌కు ఈ ప్రమాదం తప్పింది.
ప్రయాగ్ రాజ్ జిల్లాలోని భోలా కా పూర్వ గ్రామానికి చెందిన భన్వర్ సింగ్ అనే రైతు తన పొలం వైపు వెళుతుండగా.. లాల్‌గోపాల్‌గంజ్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై పగుళ్లను గుర్తించాడు. అప్పుడే అటుగా వస్తున్న రైలును సైతం గమనించాడు. వెంటనే అప్రమత్తమై ఎర్రని వస్త్రాన్ని చూపుతూ.. రైలును ఆపాలని లోకోపైలట్‌కు సంకేతాలిచ్చాడు. రైతు ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న లోకోపైలట్.. రైలు వేగానికి బ్రేకులు వేసి నిదానంగా దాన్ని ఆపాడు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Boy Saves Many Lives : పట్టాలపై గుంత.. రైలుకు ఎదురెళ్లిన పదేళ్ల బాలుడు.. వందల మంది ప్రాణాలు సేఫ్!
రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం.. లోకోపైలట్ సడెన్ బ్రేక్‌తో వేలాది మంది సేఫ్!