పగుళ్లు ఇచ్చిన 6000 టన్నులు బండరాయి Rock Cracks In Gonegandla : ఆ రాయికి ఎంతో చరిత్ర ఉంది. ఈ బండ రాయి ఎత్తు 50 నుంచి 55 అడుగుల ఎత్తు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. దీని బరువు 6000 టన్నులు ఉంటుందని తెలుస్తుంది. కానీ తీవ్రమైన ఎండ కారణంగా బండరాయి రెండుగా విడిపోయినట్లుగా పగుళ్లు వచ్చాయి. ఈ ఘటన కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలో జరిగింది. రెండు రోజుల క్రితం ఎస్సీ కాలనీలోని నరసప్ప ఆలయం వద్ద ఉన్న భారీ బండ రాయి నుంచి పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్ధం విన్న ప్రజలు ఆందోళనతో ఇళ్లలోంచి బయటకు పరుగులు పెట్టారు.
రెండుగా విడిపోయినట్లుగా పగుళ్లు :గ్రామ ప్రజలు అందరూ బండ రాయి వైపు వెళ్లారు. బండ రాయి రెండు విడపోయినట్లుగా పగళ్లు వచ్చాయి. దీనిని గమనించిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పగళ్లు వచ్చిన బండ రాయిపై మరో రెండు రాళ్లు ఉన్నాయి. బండ రాయి పూర్తిగా రెండుగా విడిపోయినట్లుయితే పైన ఉన్న ఉన్న రెండు రాళ్లు కింద పడిపోతాయి. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు ఎప్పుడు పడిపోతుందో అని ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకోని ఆందోళనకు గురవుతున్నారు. తమ కాలనీ వాసులకు ప్రమాదం పొంచి ఉందని వారు చెబుతున్నారు.
అప్రమత్తంగా ఉండాలని సూచన.. జాగ్రత చర్యలు : ఈ రాయికి చుట్టు పక్కల 50 ఇళ్లు ఉన్నాయి. జరిగిన విషయం తెలుసుకున్న ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, మైనింగ్ శాఖ ఏడీ నాగిని, సహా రాష్ట్ర విపత్తుల శాఖ సిబ్బంది, రెవిన్యూ పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బండ రాయిని అధికారులు పరిశీలించారు. స్థానిక ప్రజలను అప్రమత్తంగా ఉండాలని వారికి అధికారులు సూచించారు. రాయి పరిసరాల్లో ఉన్న 50 ఇళ్లలోని ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయాలని అధికారులు సూచించారు. ప్రజలకు ఎటువంటి ప్రమాదం జరుగకుండా ఉండేందుకు అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. బండ రాయిని తొలగించాలా? వద్దా? అని అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ బండరాయిన చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తరలి వస్తున్నారు.
రికార్డ్ స్థాయిలో ఎండలు :రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో ఎప్పుడు లేని విధంగా, రికార్డ్ స్థాయిలో ఎండలు మండి పోతున్నాయి. తీవ్ర స్థాయి ఎండల కారణంగా రాష్ట్రంలోని కొన్ని మండలాల్లో వడ గాడ్పుల ప్రభావం ఉంటుందని ఏపీ విపత్తు నిర్వహణా సంస్థ ఇప్పటికే తెలియజేసింది. ఈ ఎండలకు ప్రజలు బయటకు రావడానికే ఆలోచిస్తున్నారు.
ఇవీ చదవండి