Robot Teacher In Kerala: కొవిడ్ ఆంక్షల తర్వాత కేరళలో పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత వెళ్తున్న విద్యార్థులకు ఉపాధ్యాయులు స్వాగతం పలుకుతున్నారు. అయితే.. కన్నూర్ జిల్లాలోని మంబరం కిళత్తూరు స్కూల్‌లో విద్యార్థులకు మాత్రం రోబో టీచర్ స్వాగతం పలుకుతోంది. పిల్లలు రాగానే ఉష్ణోగ్రత పరీక్షించి వారి యోగక్షేమాలను చూసుకుంటోంది. కొవిడ్ ప్రొటోకాల్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తోంది.
robot teacher news: రాగేష్ అనే ఉపాధ్యాయుడు.. విద్యార్థుల కోసం ఈ స్మార్ట్ టీచర్‌ను అభివృద్ధి చేశారు. స్కూల్ విద్యార్థులకు స్వాగతంతో.. రోబో టీచర్ పని ప్రారంభమవుతుంది. రోజూ ప్రతి విద్యార్థి శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేస్తుంది. ఆరోగ్యంగా ఉన్న పిల్లలను మాత్రమే తరగతి గదిలోకి అనుమతిస్తుంది. విద్యార్థుల హాజరును రికార్డ్ చేస్తుంది. ఈ రోబో టీచర్ క్లాసులు కూడా తీసుకుంటుంది.