Robert Vadra in Politics: ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా 'ఈటీవీ భారత్'తో అన్నారు. రాజకీయాల్లోకి రావాలని, తన స్వస్థలమైన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించాలని ఇప్పటికే కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు అందాయని ఆయన చెప్పారు.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబర్ట్ వాద్రా!- మొరాదాబాద్ నుంచి ఎంపీగా పోటీ? - రాజకీయాల్లోకి రాబర్ట్ వాద్రా
Robert Vadra in Politics: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించాలని ఇప్పటికే పలు పార్టీల నుంచి తనకు ఆహ్వానాలు అందినట్లు రాబర్ట్ చెప్పారు.
![ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబర్ట్ వాద్రా!- మొరాదాబాద్ నుంచి ఎంపీగా పోటీ? ROBERT VADRA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14675078-505-14675078-1646747053734.jpg)
రాబర్ట్ వాద్రా
రాజకీయాల్లోకి రాబర్ట్ వాద్రా
అయితే ఈ విషయమైన కుటుంబసభ్యులతో చర్చించాకే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు రాబర్ట్ స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు చేస్తున్న భాజపా, ఇతర ఏ పార్టీపై అయినా పోరాడేందుకు రాజకీయాల్లోకి రావడం ఒక్కటే మార్గమని ఆయన నొక్కి చెప్పారు. 'వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారా?' అన్న ప్రశ్నకు ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.