తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కదులుతున్న రైలులో యువతిపై సామూహిక అత్యాచారం - రైలులో దుండగుల దోపిడీ

పుష్పక్ ఎక్స్​ప్రెస్​(Pushpak Express News) రైలులో దండుగులు దారుణానికి పాల్పడ్డారు. 20 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మిగతా ప్రయాణికులను బెదిరించి, వారి వద్ద నుంచి ఫోన్లు, డబ్బు, నగదు దోచుకున్నారు.

Robbery in running Pushpak Express
కదులుతున్న రైలులో మహిళపై అత్యాచారం, దోపిడీ..

By

Published : Oct 9, 2021, 1:21 PM IST

Updated : Oct 9, 2021, 1:32 PM IST

మహారాష్ట్ర ఠాణె జిల్లాలో(Maharashtra Thane News) దారుణం జరిగింది. కదులుతున్న రైలులోకి ప్రవేశించిన దుండగులు బీభత్సం సృష్టించారు. ప్రయాణికుల వద్ద నుంచి డబ్బు, నగలు దోచుకోవడమే కాకుండా.. ఓ 20 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

అసలేం జరిగింది?

లఖ్​నవూ నుంచి ముంబయికి వెళ్తున్న పుష్పక్ ఎక్స్​ప్రెస్​లో దుండగులు శుక్రవారం రాత్రి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇగత్​పురీ, కాసారా రైల్వే స్టేషన్​ మధ్య కొండలపై ప్రయాణించే క్రమంలో రైలు వేగం నెమ్మదించింది. ఆ సమయంలో 8 మంది దుండగులు రైలులోని డీ-2 బోగిలోకి ప్రవేశించారు.

మారణాయుధాలను పట్టుకుని 10 నుంచి 20 మంది ప్రయాణికులను దుండగులు బెదిరించారు. వారి ఫోన్లను, నగలను , డబ్బులను లాక్కున్నారు. ఎదురుతిరిగిన ప్రయాణికులపై దాడి చేశారు. రైలులో ఉన్న ఓ 20 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులు తెలిపారు.

నలుగురి అరెస్టు...

రైలు కాసారా రైల్వే స్టేషన్​కు చేరుకున్నాక.. ప్రయాణికులు సహాయం కోసం అరిచారని ముంబయి రైల్వే పోలీసు కమిషనర్​ కైసర్ ఖలీద్​ ట్విట్టర్​లో తెలిపారు. ఆ సమయంలో స్పందించిన పోలీసు సిబ్బంది.. దుండగుల్లో నలుగురిని పట్టుకున్నారని చెప్పారు.

"బాధితురాలిని వైద్య చికిత్స కోసం తరలించాం. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నాం. నిందితులను మా బృందం ప్రశ్నిస్తోంది. ఈ కేసుపై డిప్యూటీ కమిషనర్, క్రైమ్ బ్రాంచ్​ బృందం దర్యాప్తు చేపట్టింది. ప్రయాణికుల వద్ద నుంచి రూ.96,390 విలువ చేసే వస్తువులను దోచుకున్నారు. అయితే నిందితుల నుంచి రూ.34,200 విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నాం"అని మరో ట్వీట్​లో ఖలీద్​ తెలిపారు.

కల్యాణ్ రైల్వే పోలీస్​ స్టేషన్​ అధికారులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి:17 ఏళ్ల బాలికపై ప్రియుడు సహా ఏడుగురు అత్యాచారం

Last Updated : Oct 9, 2021, 1:32 PM IST

ABOUT THE AUTHOR

...view details