తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అస్థికలు కలిపివస్తుండగా విషాదం.. ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి - four died

ఇటీవలే మరణించిన తమ కుటుంబ పెద్ద అస్థికలను నిమజ్జనం చేయడానికి వెళ్లిన ఓ కుటుంబం ప్రమాద బారినపడింది. జాతీయరహదారిపై ఆగి ఉన్న ట్రక్కును క్రూజర్​ వాహనం ఢీకొట్టడం వల్ల అక్కడిక్కడే ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. బిహార్​లో జరిగిన మరో ప్రమాదంలో వివాహ వేడుకకు వెళ్తుండగా నలుగురు చనిపోయారు.

ఆసుపత్రిలో క్షతగాత్రులు
ఆసుపత్రిలో క్షతగాత్రులు

By

Published : May 17, 2022, 4:58 PM IST

Updated : May 17, 2022, 6:16 PM IST

Road Accident In Hariyana: హరియాణాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిల్లీ- జైపుర్​ హైవేపై ఆగి ఉన్న ట్రక్కును ప్రయాణికులతో ఉన్న క్రూజర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో పది మందికి పైగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

పోలీసుల వివరాల ప్రకారం..రాజస్థాన్​ జైపుర్‌లోని సమోద్ గ్రామానికి చెందిన ఓ కుటుంబం.. ఇటీవలే మరణించిన తమ కుటుంబ పెద్ద అస్థికల నిమజ్జనం కోసం సోమవారం హరిద్వార్‌కు వెళ్లింది. క్రూజర్ వాహనంలో కుటుంబసభ్యులు, బంధువులు సహా మొత్తం 17 మంది ఉన్నారు. కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తుండగా దిల్లీ- జైపుర్ హైవేలోని రేవారీపై ఉదయం 5 గంటల సమయంలో ఓధీ కట్ సమీపంలో ఆగి ఉన్న ట్రక్కును క్రూజర్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే చనిపోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.

ఆసుపత్రిలో క్షతగాత్రులు
ఆసుపత్రిలో క్షతగాత్రులు

"రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును క్రూజర్ కారు ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలిలో ఐదుగురు మరణించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించాం" అని భన్వర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి తెలిపారు.

చెట్టును ఢీకొట్టిన కారు

Accident in Bihar: బిహార్‌లోని పశ్చిమ చంపారన్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాల్మీకినగర్‌లోని లవకుశ్​ ఘాట్‌ నుంచి కౌలాపూర్‌ వివాహ వేడుకకు వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. నౌరంగియాలోని ఖైర్వా తోలా సమీపంలో బాధితులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు బాలికలు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. ఒకే కుటుంబానికి నలుగురు చనిపోవడం వల్ల ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇవీ చదవండి:వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టిన బైక్​.. 30 అడుగులు ఎగిరిపడి అక్కడిక్కడే...

భర్త మర్మాంగం కోసి హత్య.. తల్లి మృతదేహాన్ని డ్రమ్ములో పెట్టి సిమెంట్​తో..

Last Updated : May 17, 2022, 6:16 PM IST

ABOUT THE AUTHOR

...view details