కేరళ తిరువనంతపురంలో కారు, లారీ ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.
ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురు మృతి - కేరళలో రోడ్డు ప్రమాదం
కేరళ తిరువనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీకొని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
కారు-లారీ ఢీ.. ఐదుగురు మృతి
జిల్లాలోని తోట్టక్కడ్ వద్ద వేగంగా వెళ్తున్న ఓ కారు, చేపల లారీని ఢీ కొట్టింది. ఈ క్రమంలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన మరో ఇద్దరు ఆసుపత్రిలో చనిపోయారని పోలీసులు తెలిపారు. మృతులు కొల్లాం జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.
ఇదీ చదవండి:బంగాల్లో టీఎంసీ నేత దారుణ హత్య