ఉత్తర్‌ప్రదేశ్‌లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బహ్రాయిచ్‌లో బస్సును ఓ భారీ ట్రక్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా 15 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెలికితీసి ఆస్పత్రికి తరలించారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం.. 15 మందికి గాయాలు - ఉత్తర్‌ప్రదేశ్ రోడ్డు ప్రమాదం
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మరణించగా 15 మంది గాయపడ్డారు.

road accident in uttarpradesh Bahraich
ఉదయం సుమారు నాలుగున్నర సమయంలో లఖ్‌నవూ బహ్రాయిచ్ హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వారిని లఖ్‌నవూలోని ట్రామా సెంటర్‌కు రెఫెర్ చేశామన్నారు. ప్రమాదానికి కారణమైన ట్రక్ ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు.. దగ్గరగా ఉన్న డాబాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి నిందితుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మంచు తీవ్రంగా కమ్ముకోవడం వల్ల కూడా ప్రమాదం జరిగి ఉండచ్చొని అనుమానిస్తున్నారు.
Last Updated : Nov 30, 2022, 9:07 AM IST