తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దట్టమైన పొగమంచు.. చెరువులోకి దూసుకెళ్లిన బస్సు.. 50 మందికిపైగా.. - సీతాపుర్​ వార్తలు

పొగమంచు కారణంగా 80 మంది కూలీలతో వెళ్తున్న బస్సు.. రోడ్డు పక్కన చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 50 మందికిపైగా కూలీలు గాయపడ్డారు.

road accident in Sitapur 50 people injured after bus fell into pond
road accident in Sitapur 50 people injured after bus fell into pond

By

Published : Dec 29, 2022, 7:58 AM IST

Updated : Dec 29, 2022, 12:29 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని సీతాపుర్​ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. 80 మంది కూలీలతో వెళ్తున్న బస్సు.. రోడ్డు పక్కన చెరువులోకి దూసుకెళ్లింది. బుధవారం అర్ధరాత్రి తంబోర్ రోడ్డు సమీపంలో జరిగిన ఈ ఘటనలో 50 మందికిపైగా కూలీలు గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులంతా భిట్నకల గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వెంటనే రియూసాలోని కమ్యూనిటీ హెల్త్​ సెంటర్​కు చికిత్స నిమిత్తం తరలించారు. తీవ్రంగా గాయపడిన కూలీలను సీతాపుర్ జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. దట్టమైన పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

చెరువులోకి దూసుకెళ్లిన బస్సు.. 50 మందికిపైగా..
Last Updated : Dec 29, 2022, 12:29 PM IST

ABOUT THE AUTHOR

...view details