తెలంగాణ

telangana

ETV Bharat / bharat

16 మంది ప్రాణాలు బలిగొన్న పొగమంచు - ఝార్ఖండ్​ రోడ్డు ప్రమాదం లేటెస్ట్ న్యూస్

Road Accident In Jharkhand: బస్సు- ట్రక్కు ఢీకొన్న ఘటనలో 16మంది మృతిచెందారు. మరో 26 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఝార్ఖండ్​లోని పాకుఢ్​ జిల్లాలో జరిగింది.

Road Accident In Jharkhand
బస్సు- ట్రక్కు ఢీ

By

Published : Jan 5, 2022, 11:14 AM IST

Updated : Jan 5, 2022, 4:41 PM IST

Road Accident In Jharkhand: ఝార్ఖండ్​, పాకుఢ్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు- ట్రక్కు ఢీకొన్న ఘటనలో 16 మంది ప్రయాణికులు మృతిచెందారు. మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. సాహిబ్​గంజ్- గోవింద్​పుర్​ రహదారిపై బుధవారం ఉదయం 8:30గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

కారణం అదే..

బస్సు బర్వా నుంచి దంకాకు వెళ్తోంది. ఎల్​పీజీ సీలిండర్లు ఉన్న ట్రక్కు బస్సుకు ఎదురుగా వస్తోంది. ఈ క్రమంలో పొగమంచు కారణంగా రోడ్డు కనపడకపోవటం వల్ల రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నట్లుగా తెలుస్తోంది.

బస్సు- ట్రక్కు ఢీ

సమాచారం తెలిసిన వెంటనే అందాపరా స్టేషన్​ పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సులో ఇరుక్కున్నవారిని తీవ్రంగా శ్రమించి బయటకు తీశారు. ప్రమాద సమయంలో రెండు వాహనాలు అతివేగంగా దూసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు.

ప్రమాదంలో నుజ్జునుజ్జయిన వాహనాలు

సీఎం విచారం..

ఈ ఘటనపై ఝార్ఖండ్ సీఎం హెమంత్ సోరెన్ విచారం వ్యక్తం చేశారు. చనిపోయినవారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చూడండి:దేశంలో కరోనా విజృంభణ - ఒక్కరోజే 58వేల కేసులు

Last Updated : Jan 5, 2022, 4:41 PM IST

ABOUT THE AUTHOR

...view details