ఝార్ఖండ్ సరాయ్కేలాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఛాయ్భాసాలో కూలీలతో వెళ్తున్న ఓ పికప్ వ్యాన్ రోడ్డుపై బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు మరణించగా.. మరో 12 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో వ్యాన్‌లో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం జరిగిందీ ఘటన.
అదుపు తప్పి వ్యాన్ బోల్తా.. ముగ్గురు మృతి.. 12 మందికి గాయాలు.. - తల్లిని హతమార్చిన కుమారుడు
అదుపు తప్పి ఓ పికప్ వ్యాన్ బోల్తా కొట్టింది. ఝార్ఖండ్‌లో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీలు మృతి చెందారు. మరో 12 మంది గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని జంషెద్పుర్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. స్వల్ప గాయాలైనవారిని రాజ్‌నగర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చేర్పించారు. క్షతగాత్రుల్లో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పికప్ వ్యాన్‌లో కూలీ పనుల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు.
వృద్ధురాలు మర్డర్..
సరాయ్కేలాలోనే మరో దారుణ ఘటన జరిగింది. వృద్ధురాలిపై పాశవిశకంగా దాడికి పాల్పడి హత్య చేసింది ఓ జంట. మృతురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు.
ఇదీ జరిగింది..
నిందితుడు ప్రీతమ్ కుమార్.. కెనరా బ్యాంకు ఉద్యోగి. అతడి భార్య రేణు గృహిణి. ప్రీతమ్ దగ్గరే అతడి తల్లి కమలాదేవీ ఉంటుంది. అయితే కమలాదేవీపై దంపతులిద్దరూ దాడి చేశారు. ఈ క్రమంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. కమలాదేవీ మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు పోలీసులు. ఆ నివేదికలో వృద్ధురాలి శరీరంపై గాయాలు ఉన్నట్లు తేలింది.