Road Accident in Jalore: రాజస్థాన్ జాలోర్‌లోని అహోల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యలు చేపట్టారు.
హైవేపై ట్రక్కు-కారు ఢీ.. ఐదుగురు దుర్మరణం - జాలోర్ రోడ్డు ప్రమాదం
Road Accident in Jalore: రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రక్కును.. ఓ కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జాలోర్‌లో జరిగింది.
తఖత్‌గఢ్ నుంచి చరలి అహోర్ వెళుతున్న ఓ కారు.. 325 జాతీయ రహదారిపై ట్రక్కును ఢీ కొట్టింది. గ్రానైట్ లోడ్‌తో వెళుతున్న ట్రక్కు టైరు పేలిపోవడం వల్ల పక్కకు నిలిపి ఉంచారు. ఈ క్రమంలోనే వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. అనంతరం మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల ఎవరనేది ఇంకా గుర్తించలేదు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:జర్నలిస్ట్ మహ్మద్ జుబైర్ అరెస్ట్