తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బస్సును ఢీకొన్న ట్రక్కు.. ఎనిమిది మంది మృతి.. ఫ్రెండ్​ బర్త్​డేకి వెళ్లి వస్తూ ఆరుగురు.. - హరియాణాలో కారు ప్రమాదం

హరియాణాలో ఓ బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు ఫరీదాబాద్-గురుగ్రామ్ రహదారిపై కారు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆరుగురు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు.

Truck rams into bus in Haryana several killed
బస్సును ఢీకొన్న ట్రక్కు

By

Published : Mar 3, 2023, 1:11 PM IST

హరియాణా అంబాలా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. కక్కర్ మజ్రా గ్రామానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పంచకుల-యమునానగర్ జాతీయ రహదారిపై ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ జరిగింది
ఉత్తర్​ప్రదేశ్‌లోని బరేలీ నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోని బడ్డీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులు, క్షతగాత్రుల్లో ఎక్కువ మంది వలస కూలీలే ఉన్నారు. గాయపడ్డ వారందరిని అంబాలా, నారైన్‌గర్‌లో సివిల్ హాస్పిటల్స్​కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. కక్కర్ మజ్రా వద్ద ముగ్గురు ప్రయాణికులు బస్సులో నుంచి దిగుతున్నారు. అదే సమయంలో వేగంగా వచ్చిన ఓ ట్రక్కు.. బస్సును ఢీకొట్టింది. స్థానికుల సహాయంతో మృతులను, గాయపడ్డవారిని బస్సులో నుంచి బయటకు తీసినట్లు వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు​ డ్రైవర్​ను అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు.

బస్సును ఢీకొన్న ట్రక్కు

పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి వస్తూ.. అనంతలోకాలకు..
ఆనందంగా స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలు జరిపి.. తిరిగి వస్తూ అనంతలోకాలకు వెళ్లారు ఆరుగురు యువకులు. కారులో వెళుతున్న వీరిని.. వేగంగా వచ్చిన ఓ డంపర్ ఢీ కొట్టడంలో అక్కడికక్కడే మృతి చెందారు. హరియాణాలో ఫరీదాబాద్-గురుగ్రామ్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

ఇదీ జరిగింది
గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. మృతులను పునీత్​, జతిన్​, ఆకాశ్​, సందీప్​, బల్​జీత్​, విశాల్​గా పోలీసులు గుర్తించారు. వీరంతా పల్వాల్ జిల్లాకు చెందిన యువకులు. అందరూ కలిసి తమ స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు గురుగ్రామ్​ వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా ఈ విషాదం జరిగింది. పాలి గ్రామ సమీపంలో ప్రమాదం జరిగింది. ఘటనలో కారు పూర్తిగా ద్వంసమైంది. కారులోంచి మృతదేహాలను సైతం తీసేందుకు వీలు కాకుండా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. వీరి వయస్సు 24 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉంటుందని తెలిపారు.

"ఫరీదాబాద్-గురుగ్రామ్ రహదారిపై కారు ప్రమాదం జరిగిందని మాకు సమాచారం అందింది. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నాం. కారులో ఉన్న వారంతా అక్కడికక్కడే మృతిచెందారు. వీరి కారు పూర్తిగా ద్వంసమై.. భాగాలన్ని రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అనంతరం కారులో నుంచి మృతదేహాలను బయటకు తీశాం. శవపరీక్షల నిమ్మిత్తం వాటిని ఆసుపత్రికి తరలిచాం." అని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details