ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి.. యాక్సిడెంట్ చూసి డ్రైవర్‌కు గుండెపోటు.. - గుజరాత్ ఘోర రోడ్డు ప్రమాదం
08:12 December 31
డ్రైవర్‌కు గుండెపోటు.. రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి..
గుజరాత్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. దాదాపు 30 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ముంబయి-అహ్మదాబాద్ హైవేపై శనివారం వేకువజామున 4 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నవ్‌సారి జిల్లా వెస్మా గ్రామ సమీపంలో బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదం సమయంలో కారులో ఉన్న 9 మందిలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. ప్రమాదం చూసిన బస్సు డ్రైవర్‌కు ఒక్కసారిగా గుండెపోటు రావడం వల్ల అతడు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకొని పూర్తి విచారణ చేపడుతున్నట్లు డీఎస్పీ వీఎన్ పటేల్ తెలిపారు.
మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు. అనంతరం మృతి చెందిన ఒక్కొక్కరి కుటుంబానికి రూ.2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. దీనితో పాటు గాయపడిన ఒక్కొక్కరికీ రూ.50,000 పరిహారం అందిస్తున్నట్లు ట్వీట్ చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిచాలని స్థానిక అధికారులను ఆదేశించారు.
వల్సాద్ నుంచి అతివేగంగా ప్రయాణిస్తున్న ఎస్వీయూ డివైడర్‌ను ఢీకొని.. ఎదురుగా ఉన్న మరో ట్రాక్‌పై పడింది. అదే సమయంలో అటుగా వస్తున్న ఓ ప్రైవేట్ బస్సు దాన్ని ఢీకొంది. దీంతో కారులో ఉన్న 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్నవారంతా.. అంక్లేశ్వర్ వాసులుగా పోలీసులు గుర్తించారు. వారంతా వల్సాద్ నుంచి తమ స్వగ్రామానికి వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. బస్సులో ఉన్న వారంతా వల్సాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు.