ఛత్తీస్‌గఢ్ భాటపరాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు-గూడ్స్ ఒకదానిని ఒకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు సహా 11 మంది మృతిచెందారు. మరో 10 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన బాలోద్బజార్-భాటపరా రహదారిపై గురువారం రాత్రి జరిగింది. సమాచారం అందుకున్న పోలీసుులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. అనంతరం శవపరీక్ష నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి పంపించారు. మృతులను సిగ్మాలోని ఖిలోరా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
"బాధితులంతా ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తున్నారు. అర్జుని సమీపంలోకి రాగానే ఓ ట్రక్కు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. 11 మంది అక్కడే చనిపోయారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో గాయపడిని వారిని సమీప ఆస్పత్రులకు తరలించాం. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం రాయ్‌పుర్‌కు పంపించాం. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం."
--సిద్ధార్ద బఘేల్, ఎస్డీఓపీ
స్నేహితుడిని దించేందుకు వెళ్తూ..
కర్ణాటక ధార్వాడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మృతిచెందారు. మరో నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసుల హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులను బెళగావి జిల్లాలని కిట్టూర్ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు.
ప్రమాదానికి ముందు మంజునాథ్ ఇదీ జరిగింది
ఔరది గ్రామానికి చెందిన మంజునాథ్.. ఇటీవలే అగ్నివీర్‌గా ఎంపికయ్యాడు. ఉద్యోగంలో చేరేందుకు వెళ్తుండగా.. కుటుంబసభ్యులు, స్నేహితులు కలిసి అతడిని విడిచిపెట్టేందుకు కారులో బెళగావి వస్తున్నారు. ఈ క్రమంలోనే ధార్వాడ్ సమీపంలోని తెగుర గ్రామానికి రాగానే.. ముందుగు వెళ్తున్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఓ బాటసారి సహా ఐదుగురు అక్కడిక్కడే మరణించగా.. మరో నలుగురు గాయపడ్డారు. వీరిని మహాంతేశ్ ముద్దోజి(40), బసవరాజ్ నరగుండ(35), నాగప్ప ముద్దౌజి(29), శ్రీకుమార్, బాటసారి రమణ గౌడార్గా గుర్తించారు. మంజునాథ్ తీవ్ర గాయాలతో జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రమాదానికి ముందు మంజునాథ్ ఇవీ చదవండి :పదో తరగతి విద్యార్థిపై దాడి చేసి చంపిన ఏనుగు.. హెలికాప్టర్ పంపిన సీఎం!
తల్వార్లతో పోలీస్ స్టేషన్ వద్ద రచ్చ.. అనుచరుడిని విడిపించుకున్న 'ఖలిస్థానీ'లు