తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లోయలోకి దూసుకెళ్లిన ఎస్​యూవీ.. అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం

Accident
లోయలోకి దూసుకెళ్లిన ఎస్​యూవీ

By

Published : Mar 5, 2022, 10:32 AM IST

Updated : Mar 5, 2022, 10:54 AM IST

10:30 March 05

లోయలోకి దూసుకెళ్లిన ఎస్​యూవీ.. అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం

Road accident: జమ్ముకశ్మీర్​ సాంబ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్​యూవీ వాహనం అదుపుతప్పి భారీ లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.

ఎస్​యూవీ వాహనం పంజాబ్​ నుంచి శ్రీనగర్​ వెళ్తుండగా మాన్సార్​ సమీపంలోని జమోదా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఐదుగురి మృతదేహాలను వెలికితీసినట్లు చెప్పారు. క్షతగాత్రున్ని స్థానిక ఆసుపత్రికి తరలించామన్నారు.

Last Updated : Mar 5, 2022, 10:54 AM IST

ABOUT THE AUTHOR

...view details