Road Accident at Warangal :అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ నిరుపేద కూలీలను బలితీసుకుంది. తెల్లవారుజామునే కూలీ కోసం ఆటోలో వెళ్తున్న ఆరుగురు కూలీల ప్రాణాల్ని లారీ మృత్యువు రూపంలో కబళించింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accidents) విషాదాన్ని నింపింది. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఆటోను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు రాజస్థాన్‌కు చెందిన చెట్లపై తేనే తీసి విక్రయించే కూలీలుగా (Migrant Workers) పోలీసులు గుర్తించారు. ఘటనలో వరంగల్‌కు చెందిన ఆటో డ్రైవర్ భట్టు శ్రీనివాస్ సైతం ప్రాణలొదిలాడు.
Old City Car Accident : పాతబస్తీలో కారు బీభత్సం.. వీడియో వైరల్
Road Accident on Khammam Warangal National Highway :స్థానికుల కథనం ప్రకారం.. ఖమ్మం నుంచి వరంగల్ వైపు వెళ్తున్న రాజస్థాన్‌కు చెందిన లారీ.. ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. అతివేగంతో రాంగ్‌రూట్‌లోకి దూసుకొచ్చిన లారీ ఆటోను కొంతదూరంపాటు ఈడ్చుకెళ్లినట్లు సీసీ కెమెరా దృశ్యాల్లో (CCTV Footage) రికార్డైంది. దీంతో ఏడుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో నుజ్జునుజ్జుగా మారింది. మృతదేహాలను బయటకు తీసేందుకు గ్రామస్థులు రెండు గంటలపాటు శ్రమించారు. నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. వర్ధన్నపేట ఆసుపత్రిలో, ఎంజీఎం(MGM) ఆసుపత్రిలో మరొకరు చికిత్సపొందుతూ ప్రాణాలొదిలారు.
"ఖమ్మం నుంచి వరంగల్ వైపు వస్తోన్న లారీ.. ఇల్లందు వద్ద ఆటోను ఢీ కొట్టింది. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. లారీ పూర్తిగా రైట్ వైపు వచ్చి ఆటోను బలంగా ఢీ కొట్టింది. మృతులంతా రాజస్థాన్‌కు చెందిన వలస కూలీలు. వీరు వరంగల్‌లో ఉంటూ తేనే సేకరించి అమ్ముతుంటారు. అలాగే ఈ ప్రాంతంలో తరుచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నేషనల్ హైవే అథారిటీ వాళ్లతో మాట్లాడి.. ప్రమాదాలు నివారించడానికి తగు ఏర్పాట్లు చేస్తాం."- రంగనాథ్, వరంగల్ పోలీసు కమిషనర్