తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జేడీయూలో ఆర్‌ఎల్‌ఎస్​పీ విలీనం - ఉపేంద్ర కుశ్వాహా

రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్​ఎల్​ఎస్​పీ)ని జనతాదళ్​ యునైటెడ్​లో విలీనం చేశారు ఆ పార్టీ అధినేత ఉపేంద్ర కుష్వాహా. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

RLSP decided to merge with JD-U as it is demand of current political situation
జేడీయూలో ఆర్‌ఎల్‌ఎస్పీ విలీనం

By

Published : Mar 14, 2021, 7:22 PM IST

బిహార్‌లోని అధికార జేడీయూలో.. ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్​పీ) విలీనమైంది. జేడీయూ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కుష్వాహాను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనను జేడీయూ జాతీయ పార్లమెంటరీ బోర్డు అధ్యక్షునిగా‌ నియమించారు.

ఉపేంద్ర కుశ్వాహా

"బిహార్​లో ఒకే విధమైన ఆలోచన కలిగిన వ్యక్తులు ఏకం కావాలి. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా ఇదే సరైన నిర్ణయం. అందుకే, నితీశ్​ కుమార్​ నేతృత్వంలోని జేడీయూలో ఆర్​ఎల్​ఎస్​పీని విలీనం చేశాం."

-ఉపేంద్ర కుష్వాహా

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న కారణంతో జేడీయూ నుంచి ఉపేంద్ర కుష్వాహాను 2007లో బహిష్కరించారు. రెండేళ్ల తర్వాత పార్టీలో తిరిగి చేర్చుకుని రాజ్యసభ సీటు ఇచ్చారు. 2013లో పార్టీ వీడిన కుష్వాహా సొంతంగా ఆర్‌ఎల్‌ఎస్​పీని స్థాపించారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత తిరిగి పార్టీలో చేరారు.

ఇదీ చదవండి:'పట్టపగలే మోదీ సర్కార్​ దోపిడీ'

ABOUT THE AUTHOR

...view details