ఎమ్మెల్యే వాహనం దొంగతనానికి గురైంది. ఈ ఘటన రాజస్థాన్ జైపుర్‌లోని వివేక్ విహార్‌లో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి గురైన స్కార్పియో కారు యజమాని.. రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ ఎమ్మెల్యే నారాయణ్ బెనివాల్. ఆయన ఖీంవాసర్ నియోజకవర్గం నుంచి 2019 లో ఎన్నికయ్యారు. నారాయణ్ బెనివాల్.. నాగౌర్ ఎంపీ హనుమాల్ బెనివాల్‌కు స్వయానా సోదరుడు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.
"వివేక్ విహార్‌లోని అపార్ట్మెంట్లో శనివారం కారును పార్క్ చేశా. ఉదయం చూసేవారికి వాహనం కనిపించలేదు. దొంగలకు పోలీసులంటే భయం లేదు. ఎమ్మెల్యే వాహనం ఇలా దొంగతనానికి గురైతే సామాన్యుల పరిస్థితి ఏంటి? సాధారణ ప్రజలను పోలీసులు తనిఖీ చేస్తారు. దొంగలు, నేరస్థులను మాత్రం స్వేచ్ఛగా వదిలేస్తున్నారు."