తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసోం ఎన్నికల్లో పోటీకి ఆర్జేడీ సై - తేజస్వీ యాదవ్ ఆర్జేడీ నేత

అసోం ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్​ ప్రకటించారు. ఈ మేరకు తమతో కలసి వచ్చే పార్టీలతో పనిచేస్తామని తెలిపారు.

RJD will contest Assam Assembly polls in alliance with like- minded parties: Tejashwi
అస్సాం ఎన్నికల్లో పోటీకి ఆర్జేడీ సై

By

Published : Feb 27, 2021, 4:52 PM IST

త్వరలో జరగనున్న అసోం శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్​ ప్రకటించారు. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా మొట్టమొదటిసారి గువాహటిలో పర్యటించారు.

భావసారూప్యత కలిగిన పార్టీలతో కలసి పనిచేయనున్నట్లు వెల్లడించిన ఆర్జేడీ నేత.. ఇప్పటికే కాంగ్రెస్​తో​ చర్చించామని తెలిపారు. ఏఐయూడీఎఫ్​నూ సంప్రదించి సంకీర్ణ కూటమిని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.

తమకు గెలుపు అవకాశాలు ఉన్న చోట కచ్చితంగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు.

''భావసారూప్యత కలిగిన పార్టీలతో కలసి భాగస్వామ్య కూటమిని ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్​, ఏఐయూడీఎఫ్ సహా ఇతర చిన్న పార్టీలతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం.''

-తేజస్వీ యాదవ్, ఆర్జేడీ నేత.

త్వరలో ఎన్నికలు జరగనున్న బంగాల్, కేరళ, పుదుచ్చేరిలలోనూ భాజపాకు వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నట్టు తేజస్వీ యాదవ్​ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:సీట్ల సర్దుబాటపై భాజపా, అన్నాడీఎంకే భేటీ

ABOUT THE AUTHOR

...view details