తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సుశాంత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసిన రియా!' - rhea chakraborty ssr

సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ స్నేహితురాలు రియా చక్రవర్తిపై ఎన్​సీబీ కీలక అభియోగాలు మోపింది. సుశాంత్ కోసం ఆమె పదేపదే నిషేధిత పదార్థాలు కొనుగోలు చేసిందని ఛార్జ్​షీట్​లో పేర్కొంది.

sushant singh rajput
'సుశాంత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసిన రియా!'

By

Published : Jul 13, 2022, 3:51 PM IST

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణంతో ముడిపడి ఉన్న డ్రగ్స్ కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. నటి, సుశాంత్‌ స్నేహితురాలు రియా చక్రవర్తిపై నార్కొటిక్స్ కంట్రోల్‌ బ్యూరో తాజాగా అభియోగాలు మోపింది. సుశాంత్ కోసం ఆమె నిషేధిత పదార్థాలను కొనుగోలు చేసిందని, అతడి మాదకద్రవ్యాల వ్యసనాన్ని ఆమె ప్రోత్సహించిందని వాటిలో పేర్కొంది. తాజా అభియోగాల్లో ఆమెతో సహా మరో 34 మంది పేర్లను చేర్చింది. వారిలో రియా సోదరుడు షోవిక్‌ పేరు కూడా ఉంది.

2020, జూన్ 14న ముంబయిలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. అతడి మరణం తర్వాత బాలీవుడ్, టెలివిజన్ రంగంలో డ్రగ్స్ వినియోగంపై ఎన్‌సీబీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దానిలో భాగంగా నెలరోజుల పాటు రియా జైలుకెళ్లాల్సి వచ్చింది. నెల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ప్రస్తుత అభియోగాల్లో.. రియా సుశాంత్‌ కోసం కొద్దిమొత్తంలో గంజాయి సేకరించిందని, అందుకోసం కొంత డబ్బు చెల్లించిందని వెల్లడించింది. ఈ కేసులో గనుక ఆమె దోషిగా తెలితే 10 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో తనపై వస్తోన్న ఆరోపణలపై నటి స్పందించింది. తనను ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

ABOUT THE AUTHOR

...view details